Breaking News

Daily Archives: July 21, 2017

నులిపురుగు నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నులిపురుగు నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో డిసిసిఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగష్టు 10 నుంచి 17వ తేదీ వరకు నులిపురుగు నివారణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. 1-19 సంవత్సరాల పిల్లలందరికి అధికారులు, సిబ్బంది నివారణ మాత్రలు వేయాలని సూచించారు. ఇందుకోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతోపనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా వైద్య ...

Read More »

ప్రాజెక్టులు ఆధునీకరించి రైతులకు నీరు

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాజెక్టులను ఆధునీకరించి తద్వారా రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణతో కలిసి వడ్లూరు ఎల్లారెడ్డి చెరువును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలతోపాటు జాతీయ రహదారికి పక్కనే ఉన్నందున అటువైపుగా వెళ్లే వారికి ఆహ్లాదకరంగా ...

Read More »

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ ప్రభుత్వం ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని పేర్కొంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. పాఠశాలల బంద్‌ పాటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్‌ అధికారంలోకి రాకముందు కెజి నుంచి పిజి విద్య హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా దాని అమలులో విఫలమయ్యారన్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యను పెంచి ...

Read More »

ముగిసిన వాల్మీకి రామాయణ ప్రవచనం

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్‌ రామాలయంలో బ్రహ్మశ్రీ ముత్యంపేట కేదారనాథ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి రామాయణ ప్రవచనం శుక్రవారంతో ముగిసింది. కేదారనాథ స్వామి గత నెలరోజులుగా వాల్మీకి రామాయణాన్ని ప్రవచిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పాదుకా పట్టాభిషేకం చేశారు. భక్తులకు ప్రవచనాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజేశ్వర్‌, కొవూరి భూమేశ్‌, బాల్‌కిషన్‌, గంగాధర్‌, పార్శి కాంశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్‌గా వంశీ

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా కో కన్వీనర్‌గా తోట వంశీకృస్ణ నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వంశీకి నియామక పత్రం అందించినట్టు జాగృతి జిల్లా అధ్యక్షుడు సి.హెచ్‌.అనంతరాములు తెలిపారు. సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. జాగృతిని నిర్మాణాత్మకంగా కామారెడ్డి జిల్లాలోని అన్నిమండలాలు, గ్రామాల్లో కమిటీలు వేసి పటిష్టం చేస్తామని, అందుకు అందరు కృషి చేయాలని చెప్పారు.

Read More »

మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలి

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రజలందరు మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మూడో విడత హరితహారంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమల్ల గ్రామంలో మంత్రి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి మనుగడ, జీవితం చెట్లతో పెనవేసుకుందన్నారు. పుట్టిన నాటి నుంచి చనిపోయే వరకు మనం వృక్ష సంపదపై ఆధారపడతామని, ...

Read More »

గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

  నందిపేట, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని కౌల్‌పూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. గత 20 సంవత్సరాలుగా తమ గ్రామానికి గ్రామ పంచాయతీ లేకపోవడంతో నానా అవస్తలు పడుతున్నామని, తమ గ్రామంలో గ్రామ పంచాయతీకి సరిపడా జనాభా ఉందన్నారు. ఇప్పటివరకు వెల్మల్‌ గ్రామ పంచాయతీకి ఆమ్లెట్‌ గ్రామంగా ఉందన్నారు. తమ గ్రామంలో 786 ఓటర్ల ...

Read More »

పాఠశాలల బంద్‌ ప్రశాంతం

  బీర్కూర్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో పిడిఎస్‌యు ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాలల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. పిడిఎస్‌యు ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి బాల్‌రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య పేరిట సుమారు 4 వేల పాఠశాలలు మూసివేయడానికి రంగం సిద్దం చేయడం అన్యాయమన్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం అంతంత మాత్రంగానే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫీజురీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ...

Read More »

ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి

  బీర్కూర్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌, తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయా అధికారులు మాట్లాడుతూ మొక్కలు పెంచడం వల్ల పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుందని, సమస్త మానవాళికి సంబంధించిన అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఆయా మండలాల్లోని ప్రజలు విధిగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ...

Read More »

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

  నందిపేట, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణంగా జూన్‌ మాసంలో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో నిలువ ఉన్న నీటి నుంచి దోమలు ఉత్పత్తి అవుతాయి. దోమ కాటుకు గురికావడం వల్ల మలేరియా జ్వరం వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది అనారోగ్యానికి గురికావడం జరుగుతుందని, దోమకాటు నివారణ పద్దతులు, నియంత్రణ చర్యలు పాటించి మలేరియాను అరికడదామని మండల వైద్యాధికారి సూచనలు, సలహాలు అందజేశారు. జ్వరమా… మలేరియా కావచ్చు…? ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వర్గానికి ...

Read More »