Breaking News

Daily Archives: July 24, 2017

వసతి గృహ సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర, బాలికల కళాశాల వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం కళాశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్‌, టిజివిపి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిశారు. వసతి గృహాల్లో తీవ్ర నీటి సమస్య ఉందని, ఇదే అదనుగా వార్డెన్లు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం లేదన్నారు. నీటి సమస్య …

Read More »

మహాధర్నా గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన గోడప్రతులను కామరెడ్డిలో సోమవారం జిల్లా అధ్యక్షుడు తుకారాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగ కులాల భవిష్యత్తు అభివృద్ది చెందే ఆస్కారముందన్నారు. ప్రభుత్వాలు వర్గీకరణ విషయంలో తమను మోసం చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం ఈనెల 27 నుంచి 30 వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దండోరా మహాసభ, మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఛలో ఢిల్లీని …

Read More »

కామారెడ్డిలో కెటిఆర్‌ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కె.టి.ఆర్‌ జన్మదిన వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్ద కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. 200 లకు పైగా మొక్కలు నాటినట్టు తెలిపారు. విద్యానగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు రాజేశ్వర్‌, గోపీగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు మామిండ్ల …

Read More »

ప్రజావాణిలో 140 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 140 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు పంపారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులున్నారు.

Read More »

రాజారాం యాదవ్‌ తీరు సరిగా లేదు

  నందిపేట, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి రాజారాం యాదవ్‌ సీనియర్‌ నాయకులను పట్టించుకోవడం లేదని, ఆయన తీరును నిరసిస్తూ సోమవారం టిడిపి ఆద్వర్యంలో డిగ్రీ కళాశాల సాదన కొరకు చేపట్టిన ధర్నాను బహిష్కరించామని పార్టీ సీనియర్‌ నాయకులు శంకర్‌, గంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం విలేకరులతో మాట్లాడారు. గత మూడేళ్ళుగా తమను పట్టించుకోవడం లేదని, ఎవరితో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. రెండు నెలల క్రితం …

Read More »

ఘనంగా మంత్రి కెటిఆర్‌ పుట్టినరోజు

  నందిపేట, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నాయకులు, పార్టీ శ్రేణులు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు పురస్కరించుకొని సోమవారం నందిపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెరాస మండల పార్టీ అధ్యక్షుడు నక్కల భూమేశ్‌ ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలలో కేక్‌కట్‌ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అదేవిధంగా నందిపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్‌ బొడ్డు రాజశేఖర్‌ ఆద్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేక్‌కట్‌చేసి పంచిపెట్టారు.

Read More »

కళాశాల ఏర్పడే వరకు పోరాటం ఆగదు

  నందిపేట, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ బస్టాండ్‌ ఎదుట టిడిపి చేపట్టిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. మండలంలోని మూడు కళాశాలల నుంచి ప్రతి సంవత్సరం 500మంది విద్యార్థులు ఇంటర్‌ పూర్తిచేస్తున్నందున డిగ్రీ కళాశాల ఏర్పాటు అవసరముందన్నారు. కెజి నుంచి పిజి లో అందరికి ఉచిత విద్య అందిస్తామని …

Read More »