Breaking News

Daily Archives: July 27, 2017

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

  కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రిడేషన్‌లకు సంబంధం లేకుండా ప్రయివేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని గురువారం టిడబ్ల్యుజెఎఫ్‌ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, డిఇవో మదన్‌మోహన్‌లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 300 లకు పైగా జర్నలిస్టులు వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తు చాలీ చాలని వేతనాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్నాయన్నారు. వారి పిల్లల చదువులు భారంగా మారాయని, ...

Read More »

వడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తాం

  కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం చెరువును ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు రవిందర్‌రెడ్డి, గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఓ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. అందులో భాగంగా వడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును, కామారెడ్డి పెద్ద చెరువును ...

Read More »

కళ్లకు గంతలతో హమాలీల నిరసన

  కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హమాలీలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సివిల్‌ సప్లయ్‌ హమాలీలు చేస్తున్న నిరసన దీక్షలు గురువారం నాటికి మూడోరోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆర్టీసి ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌గౌడ్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 18 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్న విధంగానే మనరాష్ట్రంలోనూ రేషన్‌ దుకాణాలు, హమాలీల ద్వారానే పంపిణీ ...

Read More »

విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి

  కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం నేపథ్యంలో వసతి గృహాల్లోని విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశముందని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సలహాదారు, మాజీ ఏసిబి డైరెక్టర్‌ జనరల్‌ ఎ.కె.ఖాన్‌ అధికారులకు సూచించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన భవనంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న కలెక్టర్‌ కార్యాలయాన్ని, భవన నిర్మాణాలను పరిశీలించారు. జనహిత కార్యాలయంలో కిసాన్‌ గార్డెన్‌పై అధికారులతో సమీక్షించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి, ...

Read More »

విద్యార్థులకు క్యారంబోర్డుల పంపిణీ

  బీర్కూర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌లో జిల్లా గంగపుత్ర సేవాసమితి సంఘం అధ్యక్షుడు గూండ్ల సాయిలు పాఠశాల విద్యార్థులకు గురువారం క్యారంబోర్డులు వితరణ చేశారు. చిన్నతనంలో తానుకూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని, విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా ఆటవస్తువులు, పెన్నులు, నోటుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గాండ్ల రమేశ్‌, సర్పంచ్‌ అరిగె సాయిలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Read More »

పోలీసులకు సహకరించాలి

  బీర్కూర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల వాసులు అనునిత్యం పోలీసులకు సహకరిస్తూ ఉండాలని సిఐ శ్రీనివాస్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని రాములగుట్ట తాండాలో సిఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ గోపి ఆద్వర్యంలో బుధవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన గ్రామసభలో సిఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు, పోలీసులకు సహకరిస్తూ సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఎవరైనా హక్కులకు భంగం వాటిల్లినపుడు నేరుగా తమను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు ...

Read More »