Breaking News

Daily Archives: July 28, 2017

ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లు నాటాలి

  బీర్కూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. నసురుల్లాబాద్‌ మండలంలోని బొప్పాస్‌పల్లి విత్తనశుద్ది కర్మాగారాన్ని శుక్రవారం సందర్శించారు. మొదటగా కర్మాగారంలో కొబ్బరి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా, విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. వ్యక్తిగత రాశుల ఆధారంగా తెలంగాణ తిరుమల ఆలయం చుట్టు మొక్కలు నాటాలని సూచించారు. విత్తనశుద్ది కర్మాగారం రికార్డులను పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ...

Read More »

ఘనంగా నాగుల పంచమి

  బీర్కూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో మండల ప్రజలు నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే మహిళలు భక్తి శ్రద్దలతో పాముల పుట్టవద్దకెళ్లి పాముపోసి మొక్కులు తీర్చుకున్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లినపుడు ఎటువంటి హాని చేయకుండా కాపాడాలని పూజించారు. అనంతరం ఇంటికి వచ్చి అన్నదమ్ములకు సోదరీమణులు పాలతో, నీటితో కళ్లు కడిగి బహుమతులు పొందారు. నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక వంటకాలు చేసుకొని సంబరాలు జరుపుకున్నారు. పండగ పురస్కరించుకొని బీర్కూర్‌ తహసీల్దార్‌ ...

Read More »

చికెన్‌ ధర ఢమాల్‌…

  నందిపేట, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చికెన్‌ ధర ఢమాల్‌మంది. నెలరోజుల నుంచి ఉన్న దరలో 50 శాతంపైగా తగ్గింది. నెలరోజుల క్రితం కిలో రూ. 260 ఉండగా ఇపుడు రూ. 140 వరకు తగ్గింది. ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ధరలు తగ్గాయని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు వాపోతున్నారు. మండలంలో 20కి పైగా చికెన్‌ సెంటర్లున్నాయి. గ్రామాల్లో చికెన్‌ ధర తగ్గిన విషయం తెలియకపోవడంతో నిర్వాహకులు రూ. 200 లకు పైగా కిలోకు విక్రయిస్తూ వినియోగదారుల ...

Read More »

రివ్యూ: ఫిదా

చిత్రం:  ఫిదా న‌టీన‌టులు: వ‌రుణ్‌తేజ్‌.. సాయిప‌ల్లవి.. రాజా.. సాయిచంద్‌.. శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌.. గీతా భాస్క‌ర్‌.. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే.. నాథన్ స్మేల్స్ త‌దిత‌రులు. ఛాయాగ్ర‌హ‌ణం:  విజ‌య్ సి.కుమార్‌ కూర్పు:  మార్తాండ్ కె.వెంకటేష్ సంగీతం: శ‌క్తికాంత్‌ నిర్మాణం:  దిల్‌రాజు, శిరీష్‌ ద‌ర్శ‌క‌త్వం:  శేఖ‌ర్ క‌మ్ముల‌ సంస్థ‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ తీసింది కొన్ని సినిమాలే అయినా  ప్రేక్ష‌కుల‌పై త‌న‌దైన ఓ ప్ర‌త్యేక‌ ముద్ర వేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆయ‌న  సినిమాలు చాలా నిజాయ‌తీగా, మ‌న జీవితాల్ని పోలిన‌ట్టుగా  ఉంటాయి. చూశాక ఒక మంచి అనుభూతిని క‌లిగిస్తాయి. ఆ అనుభూతి కొంత‌కాలం మ‌న‌తో పాటే ప్ర‌యాణం చేస్తుంది కూడా.  ...

Read More »

భక్తి శ్రద్దలతో నాగుల చవితి

  నందిపేట, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగుల చవితిని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. నాగదేవతలకు పాలు పోయడానికి తెల్లవారుజామునుంచే ప్రజలు పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంతోపాటు పుట్టల వద్దకు చేరుకొని పాలుపోశారు. అనంతరం ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా అక్కా,చెల్లెల్లు తమ సోదరులకు ఆవుపాలతో కళ్ళుకడిగి ఆశీర్వదించారు.

Read More »