Breaking News

ట్యూషన్‌కు వచ్చిన అమ్మాయిపై ఉపాధ్యాయుడి అత్యాచారం

ఉత్తరకాశీ : అమ్మాయిలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు. ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో జరిగింది. ఉత్తరకాశీ జిల్లా మోరీ బ్లాకులో చీవా ఉన్నత పాఠశాలలో లలిత్ కుమార్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లలిత్ కుమార్ తన ఇంటి వద్ద పాఠశాల విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. రోజూ లాగే ట్యూషన్ కు వచ్చిన విద్యార్థుల్లో 14 బాలిక మినహా మిగతావారందరినీ ఇళ్లకు పంపించాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం జరిపాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర ఉపాధ్యాయుడు లలిత్ కుమార్ ను అరెస్టు చేసి, బాధితురాలిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని ఉత్తరకాశీ ఎస్పీ దండన్ పాల్ చెప్పారు.

Check Also

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *