Breaking News

Monthly Archives: August 2017

పవన్ ట్వీట్లు చేయడమే ఘన కార్యంగా భావిస్తే..: కత్తి మహేశ్

మహేశ్ కత్తి-పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య రాజుకున్నఅగ్గి ఇంకా చల్లారలేదు. పవన్‌కు యూత్‌లో చాలా క్రేజ్ ఉంది. ఆయనను చిన్న మాట అన్నా సహించలేని అభిమాన గణం ఉంది. దీంతో మాటకు మాట పెరుగుతోందే కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా మహేశ్ ఓ టీవీ షోలో జరిగిన చర్చలో భాగంగా పవన్ అభిమాని కాల్‌కు సమాధానంగా “ఎవరయ్యా మెగా ఫ్యామిలి? ఐ కేర్ ఇట్ డామ్ ఎబౌట్ ఎనీ ఫ్యామిలీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ.. ఎవరీ మెగా ఫ్యామిలీ.. మీరేమైనా ఫ్యూడల్ …

Read More »

సినీఫక్కీలో పారిపోయేందుకు డేరా బాబా ప్లాన్!

న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ సింగ్ పోలీసుల నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన మాట నిజమేనని తేలింది. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 20 యేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తీర్పు వచ్చిన వెంటనే ఆయన సినీఫక్కీలో తప్పించుకునేందుకు ముందుగానే పథకం రచించినట్టు హర్యానా ఐజీ (ఐఆర్బీ) కేకే రావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. పంచకుల కోర్టువద్ద పోలీసులు చుట్టుముట్టి ఉండకపోతే తన ప్రయివేటు సైన్యంతో కలిసి …

Read More »

జియోఫోన్ ఆన్ చేస్తే ఏం చూపిస్తుందో తెలుసా..!

న్యూఢిల్లీ: గ్రామీణులకు సైతం 4జీ టెక్నాలజీ రుచిచూపించేందుకే రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘జియోఫోన్’… విడుదలకు ముందే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకున్నవారు ఎప్పుడు తమ చేతికి వస్తుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జియోఫోన్‌లో ఫీచర్లు ఎలా ఉంటాయి.. నాణ్యత సంగతేంటి… ఇలా పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియో జియో అభిమానుల అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఫోన్ ఆన్ చేయగానే జియో డిజిటల్‌ లైఫ్ అన్న లోగోతో స్వాగతం పలుకుతోంది. ఆన్‌చేసిన …

Read More »

నగల దుకాణంలో పామును వదిలి..నగలు దోచుకొని వెళ్లి…

లేడీ కిలాడీల నయా మోసం రాంపూర్ : నగల దుకాణంలో పామును వదిలి…నగలను దోచుకెళ్లిన లేడీకిలాడీల బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పట్టణంలో వెలుగుచూసింది. సినీఫక్కీలో జరిగిన ఈ నగల దోపిడీ ఘటన యూపీలో సంచలనం రేపింది. రాంపూర్ పట్టణంలోని మెస్టన్ గంజ్ లో ఉన్న పరితోష్ చాందీవాలా నగల దుకాణానికి బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు వచ్చారు. వస్తూనే నగల దుకాణంలోకి ఓ పామును వదిలిపెట్టారు…పామును చూసిన నగల దుకాణం యజమాని పరితోష్ భయంతో దుకాణం వదిలి బయటకు పరుగులంకించుకున్నాడు. అంతే ఆ మహిళలు …

Read More »

మాటల తూటాలు పేల్చిన కిమ్, ట్రంప్

ప్యాంగ్‌యాంగ్/వాషింగ్టన్: ఉత్తరకొరియా, అమెరికా దేశాధ్యక్షుల వైఖరి ఆందోళనకరంగా మారింది. ఇరుదేశాధినేతల ఘాటు వ్యాఖ్యలు ఉద్రిక్తకర పరిస్థితులను మరింత వేడెక్కిస్తున్నాయి. వరుస క్షిపణి పరీక్షలతో కొరియన్ ద్వీపకల్ప ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ అమెరికా, అమెరికా మిత్రదేశాలకు వణుకుపుట్టిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పందించారు. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించడంపట్ల తన వైఖరిని తెలియజేశారు. పసిఫిక్ సముద్రంలోని అమెరికా ద్వీపం ‘గువామ్’పై ‘దాడికి అర్థవంతమైన పల్లవి’గా పేర్కొన్నారు. మరికొన్ని క్షిపణి పరీక్షలను నిర్వహించనున్నామని తేల్చిచెప్పారు. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆంక్షలు విధించడంపట్ల తన వ్యతిరేకత వ్యక్తం …

Read More »

ముద్దు సీన్లన్ని తాతయ్యకు చూపించండి: వర్మ

వివాదాలు, ప్రశంసలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన అర్జున్‌రెడ్డి మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విడుదల నుంచి అండగా ఉన్న రామ్‌గోపాల్‌ వర్మ అర్జున్‌ రెడ్డిపై ఫేస్‌ బుక్‌ వేదికగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వీహెచ్‌ను ఉద్దేశిస్తూ మరో కామెంట్‌ చేశాడు. ‘ అర్జున్‌ రెడ్డి యునిట్‌కి నేనిచ్చే సలహా మీ సినిమాలో ఉన్న ముద్దు సీన్లన్నిటినీ బ్యాక్‌ టు బ్యాక్‌ కట్‌ చేసి ఒక పెన్‌ డ్రైవ్‌లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన …

Read More »

విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తిన ఆర్జీవీ

హైదరాబాద్: అర్జున్ ‌రెడ్డి సినిమా.. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌ను పూర్తిగా మార్చేసింది. సినిమా విడుదలైనప్పటి నుంచి సినీ ప్రముఖులు సహా కొందరు రాజకీయ ప్రముఖులు సైతం విజయ్‌ నటనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ.. వెంటనే విజయ్ నటనను ఆకాశానికెత్తారు. పవన్‌తో పోల్చారు. విజయ్ నటన అద్భుతమంటూ కితాబిచ్చారు. తాజాగా మరోసారి ‘అర్జున్ రెడ్డి’ సినిమా వీక్షించిన రామ్‌గోపాల్ వర్మ.. ఇప్పుడు విజయ్ దేవరకొండను ఏకంగా హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోతో పోల్చారు. సందేహమే లేదు.. …

Read More »

సింగర్ కల్పన భర్త గురించి తెలిస్తే షాక్ అవుతారు..

సంగీత సరస్వతి ఆమె. శాస్త్రీయం, హిందుస్థానీ, రాక్, ఫోక్, పాప్ విధానం ఏదైనా ఆమె స్వరం దానికి సౌరభాన్ని అద్దుతుంది. లక్షల గుండెల హర్షద్వానాలు అందుకుంటోంది. ఇలాంటి అమ్మాయి అసలు ఈ ప్రపంచంలోనే లేదు. కల్పన రాఘవేంద్రన్ తమిళ అమ్మాయి. ఈ తరం గాయనీమణుల్లో ఈమెదే అగ్రస్థానం. ఐదవ ఏట నుంచే సంగీత సాధన మొదలుపెట్టింది కల్పన. ఆమె తండ్రి ప్రముఖ నటుడు, సింగర్ టీఎస్ రాఘవేంద్ర. తల్లి సులోచన కూడా మంచి గాయకురాలు. చెల్లి ప్రసన్న కూడా సింగరే. మధురై టి. శ్రీనివాస్ …

Read More »

రాజమౌళి నా తండ్రి.. సమంత నా మరదలు: విజయ్ దేవరకొండ

విడుదలకు ముందే వివాదాస్పందంగా మారిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విడుదల తర్వాత మరింత వివాదాస్పదమవుతూ.. సంచలనాలు సృష్టిస్తోంది. ఒక వైపు సినిమాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు పోరాడుతుంటే.. మరోవైపు వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అర్జున్‌రెడ్డి సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ సినిమా హీరో విజయ్‌ దేవరకొండ ఒక అడుగు ముందుకేసి వీహెచ్‌ను తాతయ్య అనేశాడు. ముద్దు పోస్టర్‌తో వివాదాస్పందగా మరిన ఈ సినిమాను తెలంగాణ మంత్రి కేటీఆర్ వీక్షించడంతో తాజాగా వీహెచ్ మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డ్రగ్స్ …

Read More »

‘గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం’

డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు దత్త పుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ ఇశాన్‌ల సంబంధంపై ఆమె భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య హనీప్రీత్‌, బాబా గుర్మీత్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని విశ్వాస్‌ గుప్తా అన్నారు. హనీప్రీత్‌ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో విశ్వాస్‌ గుప్తా, హనీప్రీత్‌లకు వివాహం జరిగింది. 2011లో హనీప్రీత్‌ నుంచి విడాకులు కోరుతూ గుప్తా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గుర్మీత్‌, హనీప్రీత్‌లు శృంగారంలో పాల్గొంటూ తనకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారని విడాకుల పిటిషన్‌లో …

Read More »