Breaking News

Daily Archives: August 2, 2017

ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ఎస్‌ఐ అంజిరెడ్డిని సస్పెండ్‌ చేయాలని బుధవారం సిపిఎం, సిఐటియు, ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఐ అంజిరెడ్డి నిజాంసాగర్‌ మండలం కోమలంచ గ్రామానికి చెందిన బాలమ్మ అనే మహిళను విచక్షణ లేకుండా దారుణంగా చితకబాదాడన్నారు. మంగళవారం రాత్రి కుర్మ బాలమ్మ కొడుకు కుర్మ రాజశేఖర్‌ దొంగతనం చేశాడనే నెపంతో చిత్రహింసలు చేసి కొట్టగా అతను ఆసొమ్మును తన …

Read More »

70 కోట్ల చేపపిల్లలు పెంచడం ప్రభుత్వ లక్ష్యం

  కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈయేడు రాష్ట్రంలో 70 కోట్ల చేప పిల్లలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేపపిల్లల పెంపకం, గొర్రెల పంపిణీ పథకంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రెవెన్యూ, పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖ అధికారులు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. రిజర్వాయర్ల వద్ద కమిటీలతో అవగాహన సదస్సులు నిర్వహించాలని, …

Read More »

తల్లిపాలపై విస్తృత అవగాహన కల్పించాలి

  కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జనహిత సమావేశ మందిరంలో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆగస్టు 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో వివిధ శాఖల సిబ్బంది తల్లిపాలపై అవగాహన కల్పించాలన్నారు. నవజాత శిశువు నుంచి 6 నెలల వరకు ముర్రుపాలు తాగించడంపై అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు మహిళా …

Read More »

వసతి గృహాల విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలి

  కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అన్ని వసతులు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్‌ ఆర్‌.లక్ష్మణ్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులను ఆదేశించారు. బుధవారం సంక్షేమ అధికారులతోవీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్యాబులోని ఆప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, ఆ వివరాలను పొందుపరచాలని సూచించారు. విద్యార్థులకు సంబంధించిన ఆదార్‌కార్డుల సీడింగ్‌ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. పోస్టుమెట్రిక్‌ హాస్టల్స్‌ నిర్వహణ, ప్రవేశాలు, వసతి సౌకర్యాల కల్పన …

Read More »

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలి

  కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరికి అందించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అర్హులైన లబ్దిదారులకు వారి డబ్బులను వేగవంతంగా అందజేయాలన్నారు. లబ్దిదారులకు పెళ్లిరోజునే డిడి అందజేసి వారి కళ్ళలో ఆనందం చూడాలని, వారితోపాటు పెళ్లి భోజనం చేసి రావాలని సూచించారు. హరితహారంపై ప్రత్యేక దృస్టి సారించాలని, …

Read More »

చీరెల పంపిణీ విజయవంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దసరా పండగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ టెక్స్‌టైల్స్‌ కమీషనర్‌ శైలజ ఆదేశించారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా సందర్భంగా బతుకమ్మ పండగ మొదటిరోజు నుంచి చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. తొమ్మిది రోజుల పాటు పంపిణీ జరుగుతుందని చెప్పారు. గైడ్‌లైన్స్‌ ప్రకారం నిర్నీత …

Read More »

భవన నిర్మాణ అనుమతుల్లో నిబందనలు సవరించాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ అనుమతుల్లో నిబందనలు సవరించాలని మంగళవారం కామారెడ్డి ఇంజనీర్స్‌ అసోసియేసన్‌ ప్రతినిదులు కామారెడ్డి ఆర్డీవో, మునిసిపల్‌ ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌, టిపివో శైలజలకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన అనుమతుల దరఖాస్తుల్లో చేరిన కామన్‌ అఫిడవిట్‌లో లైసెన్సుడ్‌ టెక్నికల్‌ పర్సన్‌లను బాధ్యులను చేయడం తగదన్నారు. ఇంజనీరే ప్రతీదానికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్న నిబందన సరికాదన్నారు. తామెలా బాద్యత వహిస్తామని పేర్కొన్నారు. దాన్ని సవరించాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీర్లు …

Read More »

విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

  కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ కోసం ఎంపికయ్యారు. వీరిని మంగళవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అభినందించారు. కౌలాస్‌ గిరిజన వసతి గృహానికి చెందిన దినేష్‌, శ్యాంరావు, కె.ఎన్‌.రాజ్‌ కల్లాలి, సునీల్‌, అరవింద్‌లు వివిధ విభాగాల్లో శిక్షణ కోసం సీట్లు సాధించారు. వీరితోపాటు పిఇటిలను కలెక్టర్‌ అభినందించారు. తమ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ వెళ్లి అకాడమిలో ప్రవేశం కల్పించేందుకు జిల్లా …

Read More »

గంగమట్టితో గణపతులు

  కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులో గంగమట్టితో గణపతి విగ్రహాలు తయారుచేస్తు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ వ్యాపారి. నిజామాబాద్‌ కేంద్రానికి చెందిన తీరుబాయి కలకత్తా నుంచి ప్రత్యేకంగా తెచ్చిన గంగమట్టితో ప్రతియేటా వినాయక విగ్రహాలు తయారుచేస్తుంటాడు. పర్యావరణానికి హానిచేసే పివోపిని, రంగులను వాడకుండా, గంగమట్టిని సహజ సిద్దమైన రంగులను వినాయక తయారీలో వినియోగిస్తారు. ఈయేడు సైతం కలకత్తా కళాకారులతో వివిధ ఆకృతులలో పట్టణంలో గణనాథుని విగ్రహాలు తయారుచేస్తున్నారు. మట్టి విగ్రహాలవైపే …

Read More »