Breaking News

Daily Archives: August 3, 2017

ఆర్టీసి డిపో ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట గురువారం ఏఐఎస్‌ఎఫ్‌, టిజివిపి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమకొండ, పెద్ద మల్లారెడ్డి, సింగరాయపల్లి రూట్లలో నడుపుతున్న బస్సు సమయాల్లో మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల కళాశాలలు సమయానుకూలంగా బస్సులు నడపాలని గతంలో పలుమార్లు కోరినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సమయంలో మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో …

Read More »

విఠల్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తొలి ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్‌రెడ్డి బుధవారం మృతి చెందగా గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ విఠల్‌రెడ్డి భౌతిక కాయానికి పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం కుటుంబీకులతో మాట్లాడారు. కామారెడ్డి తొలి ఎమ్మెల్యేగా, స్వాతంత్య్ర సమరయోధునిగా విఠల్‌రెడ్డి సేవలు మరువలేనివన్నారు. ఆయన వెంట ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజిబుద్దీన్‌, పార్టీ సీనియర్‌ నాయకులు పున్న రాజేశ్వర్‌, నిట్టు వేణుగోపాల్‌రావు తదితరులున్నారు.

Read More »

బాలమ్మపై దాడిచేసిన ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలమ్మపై దాడిచేసిన నిజాంసాగర్‌ ఎస్‌ఐ అంజిరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏఐఎఫ్‌డిడబ్ల్యుఎ రాష్ట్ర కార్యదర్శి సుకన్య డిమాండ్‌ చేశారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో గురువారం ఏఐఎఫ్‌డిడబ్ల్యుఎ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓ వైపు కేంద్ర ప్రభుత్వం మనువాద విధానాలు అమలు చేస్తుండగా, రాష్ట్రంలో పరోక్షంగా మహిళలను అణిచివేసే విధానాలు అమలవుతున్నాయన్నారు. కుర్మ బాలమ్మపై దాడి ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. జిల్లా ఎస్‌పి మహిళ అయి …

Read More »

నల్లబ్యాడ్జీలతో కాంగ్రెస్‌ నాయకుల నిరసన

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం కామారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే అది సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ పుణ్యమేనన్నారు. కెసిఆర్‌ కాంగ్రెస్‌ను విమర్శించడమంటే కన్నతల్లిని దూషించినట్టేనని,ఆయనకు పుట్టగతులుండవని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ద్వారా కేవలం కెసిఆర్‌కుటుంబమే …

Read More »

ప్రగతి పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ప్రగతి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. ఆయా శాఖల పనుల పురోగతిపై గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాద సూచికల ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేయాలన్నారు. …

Read More »

హరితహారంలో పాల్గొన్న రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీప్‌ కన్సర్వేటర్‌ ఫారెస్టు

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీప్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు పి.కె.జా గురువారం కామారెడ్డి పట్టణంలో హరితహారంలో పాల్గొన్నారు. ఆయన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి కలెక్టరేట్‌ ప్రాంగణంలో మొక్కలునాటి నీరుపోశారు. అంతకుముందు పట్టణంలోని మునిసిపాలిటి, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో, సివిల్‌ సప్లయ్‌ శాఖ ఆద్వర్యంలో వాసవీ రైస్‌మిల్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులందరు సమన్వయంతో పనిచేసి విజయవంతం …

Read More »