Breaking News

Daily Archives: August 7, 2017

రాంలింగేశ్వర గుట్టపై అన్నదానం

  పిట్లం, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలం చిన్నకోడప్‌గల్‌ పంచాయతీ పరిధిలోగల రామలింగేశ్వర గుట్టపై సోమవారం పిట్లంకు చెందిన పత్తి పండరి గుప్తా కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయంలో చిన్నకాశిగా పిలువబడే రామలింగేశ్వర ఆలయంలోఉదయం బిల్వార్చన, రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి దర్శించుకున్న భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, మాణిక్యం, సంతోష్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More »

రెడ్డి సంఘ ఐక్యవేదిక బలోపేతానికి కృషి

  – జిల్లా కన్వీనర్‌ చంద్రారెడ్డి పిట్లం, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రెడ్డి సంఘం ఐక్యవేదిక బలోపేతానికి కృషి చేస్తానని కామారెడ్డి జిల్లా కన్వీనర్‌ చంద్రారెడ్డి అన్నారు. ఆయన రాష్ట్ర రెడ్డి సంఘ ఐక్యవేదిక పిలుపు మేరకు సోమవారం పిట్లం మండల కేంద్రంలో రెడ్డి సంఘ సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో రెడ్డి సంఘ సభ్యులు రాజకీయంలో, అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చర్యలు చేపడతామని, రెడ్డి సంఘం సభ్యులు ఒక్క తాటిపై …

Read More »

అమరుల స్ఫూర్తి యాత్ర విజయవంతానికై సదస్సు

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమరుల స్ఫూర్తి యాత్ర విజయవంతం చేసేందుకు ఈనెల 11,12 తేదీల్లో టిజేఏసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆధ్వర్యంలో కామరెడ్డి జిల్లాలో సన్నాహక సదస్సు నిర్వహించనున్నట్టు ప్రజా సంఘాల ప్రతినిధులు తెలిపారు. సోమవారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టు, కార్మిక, దళిత సంఘాలతో సమావేశమై మాట్లాడారు. కోదండరాం నిర్వహిస్తున్న అమరుల స్పూర్తియాత్రలో భాగంగా ఈనెల 11,12 తేదీల్లో కామారెడ్డిజిల్లాలో యాత్ర జరుగుతుందన్నారు. యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద …

Read More »

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో సోమవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోదర సోదరీమణుల ఆప్యాయత, అనురాగాలకు గుర్తుగా నిర్వహించే రక్షాబంధన్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆయన సోదరి సత్యవతి రాఖీ కట్టగా, ప్రబుత్వ విప్‌ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు ఆయన సోదరీమణులు బాలలక్ష్మి, సుగుణ, ప్రమీల, విమలక్కలు రాఖీ కట్టారు. వీరితోపాటు కలెక్టర్‌ …

Read More »

ప్రజావాణిలో 38 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 38 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను వాటి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు కలెక్టర్‌ సత్యనారాయణ పంపినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల తదితరులు పాల్గొన్నారు.

Read More »

చేనేత వస్త్రాలు ధరించి పని కల్పించాలి

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరముందని, వారికి చేతినిండా పని కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. సోమవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మునిసిపాలిటి కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం మునిసిపాలిటి కార్యాలయంలో మహిళా సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. చేనేత వస్త్రాలు వినియోగిస్తామని, మునిసిపాలిటీ, గ్రామ కమిటీల ద్వారా తీర్మానం చేయించాలన్నారు. …

Read More »