Breaking News

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

 

కామరెడ్డి, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక నాయకులు డిమాండ్‌ చేశారు. కామరెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మీడియా సమక్షంలో కార్మిక సంఘాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అన్ని రంగాల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని, ప్రజాస్వామిక ఉద్యమాలపై పోలీసుల నిర్బందాన్ని నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. కార్మిక సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అన్ని ట్రేడ్‌ యూనియన్లను చర్చలకు పిలవాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిదులు సిద్దిరాములు, దశరథ్‌, అనసూయ, వెంకట్‌, మోతిరాం, ప్రకాశ్‌, రాజనర్సు, అరుణ్‌, భానుప్రసాద్‌, చారి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *