విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

కామారెడ్డి, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ జీవన ఇంధన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజ్ఞానభారతి డిగ్రీ కళాశాలలో ఎన్‌వైసిఎస్‌ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు డ్రాయింగ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జీవ ఇంధనం సంబంధించిన కార్యక్రమాల కార్యాచరణ గురించి వివరించారు. గురువారం ఇదే అంశంపై పాఠశాల, కళాశాలల విద్యార్థులతో స్థానిక శిశుమందిర్‌ పాఠశాల నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 11న ప్రజ్ఞా డిగ్రీ కళాశాలలో సెమినార్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌వైసిఎస్‌ జిల్లా ప్రతినిధి బాపురెడ్డి, ప్రతినిధులు బాలకిషన్‌, సంగం నరేశ్‌, ప్రిన్సిపల్‌ కాశాగౌడ్‌, అధ్యాపకులు రాజు, మహిపాల్‌, ఆంజనేయులు తదితరులున్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *