ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

 

కామారెడ్డి, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 57వ యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలోబుధవారం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోయల్‌కర్‌ కన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రస్తుత తెరాస ప్రబుత్వ హయాంలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడిలతో, ఆవేదనతో ఉందన్నారు. అటు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెరాస ప్రజాభీష్టంమేరకు నడుచుకోకుండా ప్రజావిరుద్ద పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్‌ మోసపూరిత ప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు షేరూ, కౌన్సిలర్‌ జొన్నల నర్సింలు, చింతల శ్రీనివాస్‌, జమీల్‌, ముదాం రమేశ్‌, కిషన్‌, శ్రీధర్‌, నర్సింగ్‌, ప్రసాద్‌, ప్రభాకర్‌రెడ్డి, రాజు, సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *