పౌష్టికాహారంపై కరపత్రాల ఆవిష్కరణ

 

కామారెడ్డి, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లల పౌష్టికాహారానికి సంబందించి తల్లులు అందించాల్సిన ఆహారంపై రూపొందించిన కార్డులను బుధవారం జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఐసిడిఎస్‌ పిడి రాధమ్మ, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరిసుష్మ, సిడిపివో సంధ్యారాణి, సూపర్‌వైజర్‌ స్వర్ణలతలు కార్డులను పిల్లల తల్లులకు పంపిణీ చేశారు. కార్డు గురించి వారికి వివరించారు. అంగన్‌వాడికి వచ్చే పిల్లలకు వారి శారీరక, ఆలోచన, జ్ఞాపకశక్తిని బట్టి వివరాలు కార్డుల్లో పొందుపరిచి తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. మూడునెలలకోసారి విద్యార్థుల అభ్యాసక ప్రక్రియ మీద కార్డుల్లో పొందుపరుస్తామని వివరించారు. అంగన్‌వాడిల ద్వారా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్‌ గణేష్‌, కార్యకర్తలు అంజమ్మ, సరస్వతి, కవిత, ఇమామ్‌ ఉన్నీసా తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *