ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలు

 

నందిపేట, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బైపాస్‌ రోడ్డులోగల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వినీత్‌ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ దేశంలో యువజన కాంగ్రెస్‌ ఏర్పడి 57 సంవత్సరాలు పూర్తయిందన్నారు. యువజన కాంగ్రెస్‌ వల్ల యువకులు రాజకీయాలవైపు ఆకర్షితులై నాయకులుగా ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల వరకు ఎదిగారన్నారు. జిల్లావాసి తాహెర్‌బిన్‌ హందాన్‌ యువజన కాంగ్రెస్‌లో పనిచేసి ఈరోజు డిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడన్నారు. క్విట్‌ఇండియాను స్ఫూర్తిగా తీసుకొని దాని లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో అదేరోజు యువజన కాంగ్రెస్‌ ఏర్పటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెంట ఇంద్రుడు, యువజన కాంగ్రెస్‌ నాయకులు మహిపాల్‌, కిషోర్‌, ప్రశాంత్‌, ఉస్మాన్‌, నాయకులు ముత్యం, కొత్తూరు రాజేశ్వర్‌, లింగం, తదితరులున్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *