సినిమా ఛాన్స్ కోసం అమ్మాయి వెళితే..దర్శకుడు కోరిక తీర్చమన్నాడు…

పూణే : ఓ కళాశాల అమ్మాయి సినిమాలో నటించేందుకు అవకాశం ఇవ్వాలని అడిగితే…ఓ సినీదర్శకుడు తన లైంగిక కోరిక తీర్చమని చెప్పిన ఘటన పూణే నగరంలో సంచలనం రేపింది. మహారాష్ట్రలోని జెజూరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఓ అమ్మాయి పూణే నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో చదువుకుంటోంది. సెలవుల్లో తన స్వగ్రామమైన జెజూరీకి వచ్చిన అమ్మాయికి వాట్సాప్‌లో తాము కొత్తగా నిర్మించనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. దీంతో సినిమాలో నటించాలనే తన కలను నిజం చేసుకుందామని భావించిన కళాశాల అమ్మాయి బ్యాగులో బట్టలు సర్దుకొని పూణే నగరానికి వచ్చింది. ఆడిషన్ కోసం కళాశాల అమ్మాయి కాలేవాడీలోని తప్కీర్ చౌక్ కు వెళ్లి సినీదర్శకుడు అప్పా పవార్‌ను కలిసింది. దర్శకుడు కాస్తా ఆడిషన్ చేయకుండానే తన లైంగిక కోరిక తీరిస్తే సినిమాల్లో నటించేందుకు పలు అవకాశాలు కల్పిస్తానని హామి ఇచ్చాడు. దర్శకుడి మాటలతో షాకింగ్ కు గురైన కళాశాల అమ్మాయి భయంతో అక్కడినుంచి తిరిగి జెజూరీ గ్రామానికి వెళ్లిపోయింది. ఆలోచించుకొని రెండు రోజుల తర్వాత తిరిగి పూణే వచ్చిన అమ్మాయి కోరిక తీర్చమన్న సినీదర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సబ్ ఇన్ స్పెక్టరు సంగీత చెప్పారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *