ఇంజనీరింగ్‌ పనులకు సోషల్‌ ఆడిట్‌..!

  •  స్థానికుల సంతకం తప్పనిసరి
  •  అవకతవకలకు చెక్‌
  •  ఇప్పటికే గూగుల్‌ మ్యాప్‌ సహా ప్రతిపాదనలు రెడీ
హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం.. అవినీతికి కేరాఫ్‌. అక్రమాల పుట్ట. వేయని రోడ్లు వేసినట్టు.. తరలించని నాలా పూడిక వ్యర్థాలను తరలించినట్టు.. అదీ ఆటో లు, కార్లు, ద్విచక్రవాహనాల్లో.. చూపడంలో ఆరితేరిన ఘనులు. మళ్లీ మాన్‌సూన్‌ వచ్చింది. ఇప్పటి వరకు వర్షాలు అంతగా కురవకున్నా.. సాధారణంగా హైదరాబాద్‌లో ఆగస్టు, సెప్టెంబర్‌లో అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఇలాంటి సీజనల్‌ పనుల కోస మే కొందరు ఇంజనీర్లు వేచి చూస్తుంటారు. వర్షాలకు పాడైన రోడ్ల రీ కార్పెటింగ్‌, మరమ్మతు పనుల పేరిట కోట్లాది రూపాయలు కొల్లగొడతారు. ఈ విషయం బహిరంగ రహస్యం. వారి అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు సంస్కరణలు తీసుకువస్తే.. వాటిని తలదన్నే ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తారు. ఈ సారి ఇంజనీర్ల అక్రమాలు సాగకుండా కొత్త విధానాలను అమలులోకి తీసుకొస్తున్నారు. కార్పెటింగ్‌ చేసే రోడ్ల వివరాలతో కూడిన గూగుల్‌ చిత్రాన్ని ప్రతిపాదనలతోపాటు పంపాలి. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తా రు. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఎన్ని లక్ష ల రూపాయలతో కార్పెటింగ్‌ చేస్తున్నారన్న వివరాలు పొందుపరుస్తారు. దీంతో డిఫెక్ట్‌ లయబులిటీ పీరియడ్‌ వరకు ఆ మార్గంలో మరమ్మతు (నిబంధనల పరిధిలోకి వచ్చేవి) పనులు చేయాల్సిన బాధ్యత కాం ట్రాక్టర్‌దే. ఇప్పుడు తాజాగా నిర్వహణ, మరమ్మతు పనులకు సోషల్‌ ఆడిట్‌ తప్పనిసరి చేశారు. ఇంజనీరింగ్‌ అధికారులు ఎక్కడ రోడ్డు వేసినా.. గుంత పూ డ్చినా.. స్థానికులతో సంతకాలు తీ సుకోవాలి. అక్కడ పనులు చేసిన ట్టు ఫోన్‌ నెంబర్లతో సహా పౌరుల వివరాలు తీసుకోవాలి. ర్యాండమ్‌గా వారిలో కొందరికి ఫోన్‌ చేసి ఉన్నతాధికారులు పరిశీలిస్తారు.
             మంగళవారం ఈ విషయంపై క మిషనర్‌ డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు 23,095 గుంతలు పూడ్చామని, రూ.28.60 కోట్ల అం చనా వ్యయంతో నాలా పూడికతీత పనులకు అనుమతి ఇవ్వగా.. 78 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. సామాజిక బాధ్యతగా 100 షీ టాయిలెట్ల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యంలో వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. ఆగస్టు 15వ తేదీలోపు 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చే యాలన్నారు. ఇంజనీరింగ్‌ పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *