రైతుల నిరసననను తెరాసపై రుద్దేందుకు ప్రయత్నం

 

కామరెడ్డి, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం తలపెట్టిన అమరుల స్పూర్తియాత్రను రైతులు అడ్డుకొని నిరసన తెలపగా దాన్ని తెరాసపై రుద్దేందుకు ప్రయత్నించడం సమంజసం కాదని తెరాస నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆపార్టీ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, మామిండ్ల రమేశ్‌, పిప్పిరి ఆంజనేయులు, గోపీగౌడ్‌, బల్వంతరావులు మాట్లాడుతూ కోదండరామ్‌ కాంగ్రెస్‌ ఏజెంట్‌ల మారిప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకుంటున్నారన్నారు. దీనికి విద్యార్థి సంఘాలను పావులా వాడుకుంటున్నారని, తద్వారా రాజకీయంగా లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులు దీన్ని నిరసిస్తూ అడ్డుకుంటే తెరాసపై నింద వేయడం సమంజసం కాదన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై విద్యార్థి సంఘాల నాయకులే దాడిచేశారని, అడ్డుకున్న తెరాస నాయకులపై సైతం దాడిచేసి గాయపరిచారని పేర్కొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *