Breaking News

ప్రారంభానికి ముందే మద్యం అడ్డాగా మారిన బల్దియా కార్యాలయం

 

కామరెడ్డి, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బల్దియా కార్యాలయం ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి బల్దియా కార్యాలయాన్ని నిర్మించగా అది ప్రారంభానికి సైతం నోచుకోలేదు. ఇదే అదనుగా మందుబాబులు మాత్రం దాన్ని దాబాగా మార్చుకున్నారు. కార్యాలయం ఆవరణలోనే మందుసీసాలు, ప్లాస్టిక్‌ గ్లాసులు, పేపర్లు దర్శనమిస్తున్నాయి. బల్దియా కాపలాదారులు ఉన్నప్పటికి నిత్యం ఇవి దర్శనమిస్తుండడం కొసమెరుపు. ఇవన్నీ బల్దియా లోపలివారే చేస్తున్నారా? బయటి వ్యక్తులు చేస్తున్నారా? బల్దియా అధికారులే పరిశీలించి తేల్చాల్సి ఉంది. మద్యం బాబులకు అడ్డాగా మారిన కార్యాలయాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరముంది.

Check Also

వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

  కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *