Breaking News

సెప్టెంబర్‌లోగా ప్రజలకు తాగునీరు అందించాలి

 

కామరెడ్డి, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తిచేసి ప్రజలకు తాగునీటిని అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం వాటర్‌గ్రిడ్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో మిషన్‌ భగీరథ పురోగతిపై సమీక్షించారు. కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో 217 కోట్లతో అంతర్గత పనులు అంచనా ఉండగా ఇప్పటివరకు 17 కోట్ల పనులు పూర్తయ్యాయని, త్వరలో మిగతా పనులు పూర్తిచేస్తామని తెలిపారు. వాటర్‌ గ్రిడ్‌ ద్వారా 43 ఆవాసాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 61 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణాలకు గాను మూడు పూర్తయ్యాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇంటింటికి నల్లాకు గాను ఫేస్‌-2 ద్వారా బాన్సువాడ నియోజకవర్గంలో 30 వేల 120 మందికి, జుక్కల్‌లో 65 వేల 756 మందికి, కామారెడ్డి నియోజకవర్గంలో 29 వేల 545 మందికి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 50 వేల 656 కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు, డిఇ మోహన్‌రెడ్డి, గ్రిడ్‌ ఇఇ రమేశ్‌, చౌదరిబాబు, గ్రిడ్‌ డిఇ రాకేశ్‌, రామారెడ్డి, ప్రశాంత్‌, ఎ.ఇ. శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

  కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *