భూతాపాన్ని తగ్గించి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలి

 

కామరెడ్డి, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూతాప పరిస్థితిని తగ్గించుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి జీవ ఇంధనం వినియోగం ద్వారా సాధ్యమవుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ జీవ ఇందనం దినోత్సవంలో ఆయన మాట్లాడారు. మన జీవన విధానంలో ఉద్గారకాలు పెరిగిపోతున్నాయని, రసాయన వినియోగం వల్ల భూతాప పరిస్థితుల్లో విపరీత మార్పులు వచ్చి మానవుని మనుగడకే ప్రమాదం ఏర్పడిందన్నారు. జీవన ప్రమాణాల్లో సమతుల్యం దెబ్బతింటుందని, వర్షాలు కురియడంలో విపరీతమైన మార్పులు వచ్చాయని, వ్యాధుల తీవ్రత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు నరకకుండా వాటిని నాటడంపై శ్రద్ద పెట్టాలని, ఇలాంటి సమస్యలకు జీవ ఇందన వినియోగం మాత్రమే సమాధానమని పేర్కొన్నారు. దాన్ని గ్రహించిప్రతి ఒక్కరు జీవన విధానంలో జీవన ఇందనం బాగమయ్యేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్‌ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నేషనల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ జిల్లా సభ్యులు రంజిత్‌మోహన్‌, భవానిశంకర్‌, ఎన్‌వైసిఎస్‌ జిల్లా ప్రతినిధులు బాపురెడ్డి, చంద్రశేఖర్‌, బాల్‌కిషన్‌, జంగం నరేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *