భూనిర్వాసితులకు నష్టపరిహారం పెంపు

 

కామారెడ్డి, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించే భూమికి నష్టపరిహారం ధర పెంచాలని రైతులు కోరగా కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దాన్ని పరిగణలోకి తీసుకొని ఎకరానికి 6 లక్షల 70 వేలు ధర నిర్ణయించినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. సదాశివనగర్‌ మండలంలోని భూంపల్లి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి భూమి కోల్పోవడం వల్ల తాము ఉపాధిని కోల్పోతున్నామని, తీవ్రంగా నష్టపోతున్నామని, మద్దతు ధర పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వంతో మాట్లాడిన కలెక్టర్‌ ధర పెంచి రైతులకు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *