Breaking News

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అరెస్టు, విడుదల

 

కామరెడ్డి, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజేఏసి అద్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ శుక్రవారం నిర్వహించిన అమరుల స్ఫూర్తియాత్ర ఆందోళనకు దారితీయడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకితీసుకొని తిరిగి హైదరాబాద్‌ తరలించినట్టు తెలుస్తుంది. అమరుల స్ఫూర్తియాత్ర కామారెడ్డి చేరుకోకంటే మునుపే బస్వాపూర్‌, భిక్కనూరులలో తెరాస రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్ఫూర్తియాత్రను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కోదండరాం వాహనశ్రేణిని అదుపులోకి తీసుకున్నారు. స్ఫూర్తియాత్ర కొనసాగిస్తే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు జరిగే ఆస్కారముందని, దాన్ని విరమించుకోవాలని సూచించారు. కోదండరాం వినకపోవడంతో ఆయన్ను అరెస్టుచేసి అదుపులో ఉంచారు. యాత్రను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేయడంతో హైదరాబాద్‌ తరలించినట్టు సమాచారం.

Check Also

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *