హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం

 అన్ని వయసుల వారు లైంగిక సమస్యలు ఎదురైతే మాత్రం తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతారు. పెళ్లంటనే భయంతో వణికిపోతారు. వాస్తవానికి ఇందులో అంత భయపడాల్సిందేమీ లేదు.
కార్తీక్‌ చూడ్డానికి ఆరడుగుల ఎత్తు, మంచి శరీర ధారుఢ్యంతో చక్కగా ఉంటాడు. నెలరోజుల క్రితం దాకా అతడలా ఎంతో ఉత్సాహంగానే ఉండేవాడు. మనసు నిండా శృంగారానికి సంబంధించిన ఆలోచనలే తిరుగుతూ ఉండేవి. ఏ ప్రభావమో కానీ, అతనికి హస్తప్రయోగం అలవావటయ్యింది. దీనికితోడు కొంత మంది సీ్త్రలతో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అతనికి పొగతాగడం, మధ్యపానం అలవాట్లు కూడా వచ్చాయి. జీవితం చాలా సరదాగా సాగిపోతోందన్న భావనతో అతడు ఉన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అనుకోకుండా వాళ్ల అమ్మానాన్నలు పెళ్లి చూపులకోసం రమ్మని కుబురు పంపారు. ఉన్నట్లుండి అతనిలో ఏదో తెలియని భయం మొదలయ్యింది. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా గంతులు వేసినవాడు హఠాత్తుగా నీరసించిపోయాడు. తీవ్రమైన ఆందోళన అతడ్ని అవరించింది. పెళ్లి రోజులు దగ్గరపడుతున్న కొద్దీ అతనిలో ఆందోళన పెరుగుతూ వచ్చింది. దీనికంతటికీ కారణం ఇటీవలి కాలంలో అతనికి అంగస్తంభనలు సరిగా లేకపోవడమే. బలవంతంగా హస్తప్రయోగం చేసుకోవడమే గానీ, మునుపటిలా ఆ పటుత్వం ఉండడం లేదు. పైగా అంగం చాలా త్వరితంగా మెత్తబడిపోతోంది. అంతా అర్థంకాని పరిస్థితి. అంతకు ముందు సంబంధం ఉన్న అమ్మాయి వద్దకు వెళ్లాడు. కానీ, ఎంతకూ అంగం స్తంభించ లేదు. అంతే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. వెంటనే ఆ అమ్మాయి ‘‘నువ్వు పెళ్లికి పనికి రావేమో!’’ అంది. ఆ మాటలు అతని గుండెల్లో గునపాల్లా దిగాయి. సరిగ్గా ఆ మరుసటి రోజే టీవీలో నా ఇంటర్వ్యూ చూసి నా వద్దకు వచ్చాడు. మొత్తం సమస్య అంతా చెప్పి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. నేను అతనికి ధైర్యం చెప్పాను. వాస్తవానికి ఇది మరీ అంత అరుదైన సమస్యేమీ కాదు. ఎంతో మంది యువకులు నేడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏమైనా ‘‘నీ లైంగిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోయేలా నేను చేస్తాను’’ అంటూ నేను వాగ్ధానం చేసేసరికి అతనికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే అతనిలో ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పాను.

మానసిక కారణాలు 

మానసిక అంశాల్లో ప్రధానంగా, భయం, ఆందోళనక, సిగ్గు, అపరాధభావన, నిరుత్సాహం, శరీరం పటుత్వం కోల్పోవడం వంటి కారణాలు ఉంటాయి. అలాగే ఆత్మన్యూనతా భావం, వాతావరణం, పరిసరాలు అనుకూలంగా లేకపోవడం, తొందరపాటు, లైంగిక విషయాల పట్ల అవగాహన లేకపోవడం, భాగస్వామి పట్ల అయిష్టత ఇవ న్నీ కారణమవుతాయి. వాస్తవానికి అంగస్తంభన సమస్యలకు చాలా వరకు మానసిక కారణాలే అధికంగా ఉంటాయి.

శారీరక కారణాలు 

అంగస్తంభనలు రాకపోవడానికి శారీరక కారణాలు కూడా తక్కువేమీ కాదు. మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు, నరాల వ్యాధులు, రక్తప్రసరణా లోపాలు ఇవన్నీ ఈ సమస్యకు కారణం కావచ్చు. అలాగే, వెన్నెముకకు దెబ్బతగలడం, ప్రమాదవశాత్తూ జననాంగానికి దెబ్బ తగలడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. అలాగే అధికరక్తపోటు, మధుమేహం,మానసిక రుగ్మత లకు వాడే మందుల్ని దీర్ఘకాలికంగా వాడుతున్న వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత కూడా ఎంతో ముఖ్యం. ఇరువురి హృదయాల్లోని ప్రేమస్థాయి మీద కూడా ఈ విషయాలు ఆధారపడి ఉంటాయి. వారిద్దరి మధ్య ప్రేమ సాన్నిహిత్యంతో పాటు ఒక సానుకూలమైన ఒక ప్రశాంత వాతావరణాన్ని పెంపొందించుకుంటే ఈ సమస్యలు చాలా వరకు సమసిపోతాయి. ఏమైనా సైకోథెరపీ ద్వారా కార్తీక్‌లో అప్పటి దాకా ఉన్న నిరాశా నిస్పృహలు అదృశ్యమైపోయాయి. అతనిలోని భయాలూ, ఆత్మన్యూనతా భావాలు అడుగంటిపోయాయి. ఏ వైద్యుడైనా ఒక స్నేహితుడిలా, ఒక ఆప్తుడిలా మారి, చికిత్స చేస్తే ఎంతటి వ్యాధి అయినా పాదాక్రాంతం కాకతప్పదు. అంగస్తంభన సమస్య తలెత్తడానికి గల మూలకార ణాల్ని పసిగట్టి చికిత్సలు చేస్తే లైంగిక సమస్యలను మటుమాయం చెయ్యవచ్చు.

హోమియో వైద్యం 
హోమియోపతిలో లైంగిక సమస్యలకు చరమగీతం పాడే ఎన్నో అద్బుతమైన మందులు ఉన్నాయి. సరియైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే, ఆ మందులు రామబాణాలుగా పనిచేస్తాయి. కార్తీక్‌ కౌన్సెలింగ్‌తో పాటు కొద్ది మాసాల పాటు క్రమం తప్పకుండా మేము సూచించిన మందులన్నీ వాడాడు. అతని సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. అతని పెళ్లి అయిపోయింది. కార్తీక్‌ దాంపత్య జీవితం ఇప్పుడు రంగులమయంగా, ఒక ఇంద్రధనుస్సులా మారిపోయింది. 

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *