
కిడ్నీలో రాళ్లు రాగానే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. రాళ్లను కరిగించే డైట్ ఫాలో అవుతుంటారు. యూరినేషన్ పెంచే మాత్రలను ఆశ్రయిస్తుంటారు. అయితే కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే శృంగారానికి మించిన ఔషధం లేదంటున్నారు పరిశోధకులు. వారంలో మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటే చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న మగవారిని మూడు బృందాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లోని వారిని వారంలో మూడుసార్లు శృంగారంలో పాల్గొనాల్సిందిగా సలహా ఇచ్చారు. రెండో గ్రూప్‌లోని వారికి యూరినేషన్ పెంచే మందులను, మూడో గ్రూప్‌వారికి రాళ్లను కరిగించే మెడిసిన్ సూచించారు. రెండువారాల తర్వాత రెండు, మూడు గ్రూప్‌లోని వారికంటే మొదటి బృందంలోని వారిలో ఈ రాళ్ల సమస్య గణనీయంగా తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ బృందంలో 31 మంది ఉండగా, 26 మందిలో కిడ్నీలో రాళ్లు తొలిగిపోయాయని వారు పేర్కొన్నారు. కిడ్నీలో ఏర్పడే చిన్నసైజు రాళ్లు (6ఎమ్ఎమ్ కన్నా తక్కువ మందం కలిగినవి) శృంగారం వల్ల వెలుపలకు వచ్చేసే అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. మొత్తానికి కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వాళ్లు వారంలో కనీసం మూడుసార్లు శృంగారంలో పాల్గొంటేచాలని తేల్చారు.
Source: Andhra jyothi

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బార్లకు భారీగా దరఖాస్తులు - March 6, 2021
- అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి - March 6, 2021
- బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు - March 6, 2021