ఉగ్రవాదం మరోసారి పంజా విసిరింది. ఈసారి స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారిపై వాహనంతో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సంలో పధ్నాలుగు మంది మృతి చెందగా, మరో 50మంది వరకూ క్షతగాత్రులయ్యారు. ఇందులో పదహారు మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యవర్గాలు వెల్లడించాయి. గురువారం బార్సిలోనాలోని లస్రంబ్లస్ రహదారిలో రద్దీగా ఉన్న సమయంలో పాదయాత్రల పైకి ఒక వ్యానుతో ఉగ్ర వాదులు దూసుకువెళ్లి ఈ మారణ హోమాన్ని సృష్టిం చారు. ఈ దాడికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న వారిలో ఒకరు పోలీసుల కాల్పుల్లో మృతిచెందినట్లు అక్కడి వర్గాలు వెల్లడించాయి. మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పర్యాటకులు, వీధి ప్రదర్శన కారులతో కిక్కిరిసి ఉండే ఈ రోడ్డుపైకి అత్యంత వేగంగా దూసుకువచ్చిన ఒక వ్యాను జనం పైకి అడ్డదిడ్డంగా వెళ్లింది. వ్యాను తాకిడికి ఎంతోమంది ఎగిరి చిందరవందరగా పడ్డారు. పలురకాలు వస్తువ్ఞలు చెల్లాచెదురుగా పడ్డాయి. దాదాపు 30 దేశాలకు చెందిన పౌరులు ఈ దాడిలో మరణించడమో, గాయపడటమో జరిగిందని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ సంఘటనతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీయగా తొక్కిసాలాట కూడా జరిగింది. అమెరికా అధ్యక్షుడు రోనాల్ట్ ట్రంప్‌తోపాటు వివిధ దేశాల అధినే తలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. స్పెయిన్‌లో ఇలాంటి దాడులు జరగడం ఇలా మొదటిసారి కూడా కాదు. గతంలో స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో 2004 మార్చిలో అల్‌కాయిదా ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయా ణికుల రైల్లో ప్రేలుడులకు పాల్పడటంతో 191 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది క్షతగాత్రు లయ్యారు. ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని కాలాను గుణంగా మారుస్తున్నారు.
వాహనాలతో దాడిచేయడం లాంటి సరికొత్త వ్యూహాలు రూపొందించి నరమేధం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం స్పెయిన్‌లో జరిగిన ఈ దాడి తామే చేసినట్లు ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) సృష్టిస్తున్న బీభత్సానికి అనేక దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. సిరి యాలో మొదలై పొరుగు దేశాలైన టర్కీలకు విస్తరిం చింది. చిన్న చిన్న దేశాలే కాదు అమెరికాలాంటి అగ్ర రాజ్యాలతోసహా ఫ్రాన్స్, బెల్జియంలాంటి ఐరోపా దేశాలు ఉగ్రవాదుల దాడులతో వణికిపోతున్నాయి. సిరియా అధ్యక్షుడు బషీర్ ఆల్ అసద్‌కు వ్యతిరేకంగా 2011లో ఆల్‌ఖైదా ‘అరేబియన్ పెనిన్సులా పేరిట పారాటం ప్రారంభించి 2013లో సిరియా ఇరాక్ భూ భాగాలను ఆక్రమించుకున్నారు.
తమ అధీనంలోకి వచ్చిన ప్రాంతాలకు ఇస్లామిక్ స్టేట్ అని పేరుపెట్టి (ఐసిస్) మారణహోమం ప్రారంభించారు. ఐక్య రాజ్యసమితి అంచనాల ప్రకారం ఐసిస్ దురాగతాల కారణంగా దాదాపు 48 లక్షల మంది సిరియా ప్రజలు శరణార్థులయ్యారు. ఒక్క జర్మనీకే దాదాపు ఏడున్నర లక్షల మంది శరణార్థుల దరఖాస్తులు అందాయి. ఇరాక్ లో తమ ఇళ్లు వదిలేసి పరారయ్యారు. అమెరికాలోని నేషనల్ సెంటర్ టెర్రరిజం అధ్యయనం ప్రకారం ఐసిస్ మొత్తం 18 దేశాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది. ఐసిస్ దాడుల్లో ఇప్పటివరకూ దాదాపు 90వేల మంది సాధారణ పౌరులతోసహా మూడు లక్షల మంది మరణించినట్లు సమాచారం. ఎక్కడ వీలైతే అక్కడ బీభత్సంసృష్టించేందుకు ఉగ్రవాదులు ఏమాత్రం వెనుకాడటంలేదు.
ముఖ్యంగా కొన్ని దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడ దాడి చేస్తారోనని ఆందోళనకు గురవ్ఞతున్నాయి. ఉగ్రవాదులను ఏరివేసి ఉగ్రభూతాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అమెరికాతోసహా అన్ని దేశాలూ నడుంకడుతున్నాయి. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏ దేశం వెళ్లినా అక్కడ ఉగ్రవాదాన్ని నిర్మూ లించాల్సిన అవసరాన్ని పదేపదే చెబుతున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు కలిసికట్టుగా అన్ని దేశాలు కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన పదేపదే చెబుతున్నారు. ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షం గానో ప్రోత్సహిస్తున్న దేశాలకు సహకారాన్ని అందించ కుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఎన్నో సందర్భాల్లో సూచించారు.
మరొకపక్క ఉగ్ర వాదులు కూడా ఆధునిక మాద్యమాలద్వారా ఈ విష బీజాలను అనేక దేశాలకు విస్తరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది యువకులు రకరకాల కారణాలతో ఉగ్రవాదంపట్ల ఆకర్షితులవ్ఞతున్నారు. నిఘా సంస్థలు ఎంత ప్రయత్నించినా, మరెన్ని చర్యలు చేపట్టినా ఉగ్రవాదభూతాన్ని సమూలంగా నిర్మూ లించలేకపోతున్నారు. అమెరికా ఆధ్వర్వంలో సంకీర్ణ దళాలు 2014 నుంచి జరుపుతున్న దాడుల్లో వేలాది మంది ఉగ్రవాదులు హతమైనా పోరుమాత్రం ఆగడంలేదు. మళ్లీమళ్లీ కొత్త కొత్త వ్యూహాలతో దాడులకు పూనుకుని ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి.
ఉగ్రవాదం వల్ల నష్టపోతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పొచ్చు. భారత్‌లోని నిఘాసంస్థలు ఎంతటి పటి ష్టమైన చర్యలు తీసుకున్నా దేశంలోని పరిస్థితుల కార ణంగా ఉగ్రవాదులదాడులను పసికట్టడంలోనూ, నివా రించడంలోనూ విఫలమవ్ఞతున్నారనే చెప్పొచ్చు. ఏది ఏమైనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాద భూతాన్ని అరికట్టేందుకు కలిసికట్టుగా దేశాధినేతలందరూ నడుం బిగించాల్సిన తరుణమిది. ఈరోజు స్పెయిన్‌లో జరిగిం ది, రేపు ఎక్కడ జరుగుతుందో, ఎంతమంది అమాయ కులను బలి తీసుకుంటారో అనే భయాందోళనలతో ప్రజలు జీవనంసాగించడం ఏమాత్రం సమంజసంకాదు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021