Breaking News

నగల దుకాణంలో పామును వదిలి..నగలు దోచుకొని వెళ్లి…

  • లేడీ కిలాడీల నయా మోసం
రాంపూర్ : నగల దుకాణంలో పామును వదిలి…నగలను దోచుకెళ్లిన లేడీకిలాడీల బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పట్టణంలో వెలుగుచూసింది. సినీఫక్కీలో జరిగిన ఈ నగల దోపిడీ ఘటన యూపీలో సంచలనం రేపింది. రాంపూర్ పట్టణంలోని మెస్టన్ గంజ్ లో ఉన్న పరితోష్ చాందీవాలా నగల దుకాణానికి బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు వచ్చారు. వస్తూనే నగల దుకాణంలోకి ఓ పామును వదిలిపెట్టారు…పామును చూసిన నగల దుకాణం యజమాని పరితోష్ భయంతో దుకాణం వదిలి బయటకు పరుగులంకించుకున్నాడు. అంతే ఆ మహిళలు దుకాణంలోని 13తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకొని పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు గుర్తుతెలియని మహిళల కోసం గాలిస్తున్నారు. నగల దుకాణంలోని సీసీటీవీ ఫుటేజిని అందజేయాలని పోలీసులు చాందీవాలాను కోరారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *