Monthly Archives: September 2017

నేడు విజయదశమి

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని దశమి రోజు శనివారం దసరా పండగ జరుపుకోవడానికి పెద్దలు కార్యక్రమాలు సిద్దం చేశారు. ప్రధాన ఆలయాల్లో పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

Read More »

ఘనంగా మహిషాసురమర్ధనం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి మహిషాసురమర్ధన కార్యక్రమం మండలంలోని ఆయా గ్రామాల్లో అర్ధరాత్రి నిర్వహించారు. భక్తులందరు మహిషాసురమర్ధనం తిలకించేందుకు అర్ధరాత్రి వరకు వేచిఉన్నారు. మండల కేంద్రంలోని హనుమాన్‌ భవాని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు రత్కంటి ప్రకాశ్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు అవారి గంగారాం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు ముగ్దులై కార్యక్రమాన్ని వీక్షించారు. రాత్రి వరకు పండగ వాతావరణం సంతరించుకుంది.

Read More »

కొనసాగుతున్న పాలిటెక్నిక్‌ ప్రహరీ నిర్మాణ పనులు

  నందిపేట, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నందిపేటలో పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేసి నిజామాబాద్‌ ప్రధాన రహదారి చెరువు పక్కన నిర్మించారు. అయితే లోతట్టు ప్రాంతంలో నిర్మించడంతో ప్రతి వర్షాకాలంలో చెరువు నిండి నీరు కళాశాలలోకి ప్రవేశిస్తుంది. దాంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగడమే కాకుండా, ఫర్నీచర్‌, భవనానికి కూడా …

Read More »

అక్రమ కట్టడంపై ఫిర్యాదు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్పనగర్‌లో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మిస్తున్న ఇంటిపై పట్టణ ప్రణాళిక అధికారులకు ఫిర్యాదు చేసినట్టు కాలనీవాసులు తెలిపారు. ఇదివరకే ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం నిలిపివేయాలని జిల్లా పాలనాధికారికి గతంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రోడ్డు ఆక్రమణకు గురవుతున్నా ఎందుకు అడ్డుకోవడం లేదని, దీని వెనక బడాబాబుల హస్తముందని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ కట్టడాన్ని అడ్డుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.

Read More »

దసరా ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్‌ నాయకులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని రాజీవ్‌గాందీ స్టేడియంలో నిర్వహించనున్న దసరా పండగ ఏర్పాట్లను శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు. ప్రతియేడు దసరా ఉత్సవ కమిటీ, షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రావణ దహనం, లేజర్‌ షో, రంగురంగుల టపాకాయల ప్రదర్శన తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. వారి వెంట …

Read More »

భక్తులకు అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని ఆజాద్‌ హిందు దుర్గా యువసేన దుర్గామాత మండపం వద్ద శుక్రవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని ప్రతిష్టించి పూజలు, అన్నదానం చేస్తున్నామని ఈయేడాది సైతం కార్యక్రమం కొనసాగించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మోతె కృష్ణాగౌడ్‌, కుంభాల రవి, నిట్టు కృష్ణమోహన్‌, ప్రతినిదులు శివాజీరావు, రాజేశ్‌, వినయ్‌, కిరణ్‌, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అనాథలకు ఆర్థిక సాయం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బెర్యబ కంపెనీ యజమాని ఎస్‌.కె.ఇస్మాయిల్‌ శుక్రవారం కామారెడ్డి పట్టణ శివారులోని వృద్ధాశ్రమంలోని అనాథలకు రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు శారద, దీక్షితలను కలిసి తనవంతు సహాయం అందజేసినట్టు తెలిపారు. వృద్ధాశ్రమం మరమ్మతులను సహకరించాలని కోరగా త్వరలో అందజేస్తామని తెలిపారు. అనంతరం వృద్దులకు అల్పాహారం, పులిహోర పంపిణీ …

Read More »

లలిత త్రిపుర సుందరీ ఆలయంలో విశేష పూజలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలోగల లలిత త్రిపుర సుందరీ, ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట మూడోరోజు అమ్మవారికి గాజుల పూజ, పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అద్యక్షుడు బాలయ్య, ప్రతినిధులు శ్రీనివాస్‌, లక్ష్మాగౌడ్‌, దామోదర్‌, నరేశ్‌, పూర్ణచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

జిల్లాలో కబడ్డి క్రీడాకారులను ప్రోత్సహిస్తాం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని కబడ్డిక్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, ఏనుగు రవిందర్‌రెడ్డి, తెలంగాణ కబడ్డి అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు అజీజ్‌ఖాన్‌, కర్తయ్య, లీగల్‌ అడ్వయిజర్‌ ఊషిరెడ్డిలు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కబడ్డి అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కబడ్డి క్రీడాకారులు చాలామంది ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారని ఆ దిశగా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం …

Read More »