Daily Archives: September 9, 2017

మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్నభోజన కార్మికులకు కనీస వేతనం రూ. 18 వేలు అమలుచేయాలని ఏఐసిటియు జిల్లా బాధ్యుడు రాజలింగం డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మిక సంఘం జిల్లా ముఖ్య సమావేశాన్ని కామారెడ్డిలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 9, 10 తరగతుల బిల్లులు గత ఏప్రిల్‌ నుంచి రావడం లేదని, దీంతో నిర్వాహకులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More »

రాజీవ్‌ స్వగృహ ఇళ్ళ పరిశీలన

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూర్‌ గ్రామంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్ళను శనివారం ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్‌ స్వగృహ ఇళ్ళను మధ్యలోనే ఆపేశారని, వాటిని డబుల్‌ బెడ్‌రూం పథకం కిందికి అనుసంధానం చేసేందుకు సంబందిత ప్రతిపాదనలు సిద్దం చేసేందుకు అధికారులను ఆదేశించామన్నారు. వారి వెంట ఆర్డీవో శ్రీను, రవిందర్‌, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Read More »

వంతెన కూలి ఒకరి మృతి

  నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న వంతెన అకస్మాత్తుగా కూలడంతో ఒకరు మృతి చెందారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో పిల్ల కాలువ కోసం చిన్నపాటి వంతెనను నీటిపారుదల శాఖ అదికారులు నిర్మించి సుమారు 50 సంవత్సరాలు గడుస్తుంది. అప్పటినుంచి పట్టించుకోకపోవడంతో, కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో అకస్మాత్తుగా వంతెన కూలడంతో చాకలి పెద్ద సాయిలు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. …

Read More »

ప్రజాకవి కాళోజీ

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో శనివారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, మండల అభివృద్ది కార్యాలయంలో భరత్‌కుమార్‌, ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాళోజీ జీవితం గురించి, భాష గురించి వక్తలు మాట్లాడారు. కాళోజీ రచనలు, తెలంగాణ ఉద్యమంలో కాళోజీ పాత్ర గురించి వివరించారు.

Read More »

వెంకటేశ్వర ఆలయంలో అన్నదానం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల విరాళంతో నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం స్వామివారికి ప్రీతిరోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు ఏర్పాటు చేశారు. అన్నదాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.

Read More »

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పకడ్బందీగా చేపట్టాలి

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో ఆయన సాధారణ, పరిపాలనా శాఖనుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఈనెల 15 నుంచి భూమి రికార్డుల సవరణ సర్వే ప్రారంభమవుతున్నందున తహసీల్దార్లు, డిప్యూటి తహసీల్దార్లు వేరువేరు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో పర్యటించి గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. భూ రికార్డుల వివాదాలు లేకుండా సామరస్యంగా …

Read More »

విద్యార్థులు సృజనాత్మకతకు మెరుగులు దిద్దాలి

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు సృజనాత్మకతకు మరింత మెరుగులు దిద్దుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డిలో జరుగుతున్న వ్యక్తిత్వ వికాస రెండో శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటర్‌ ద్వితీయ, డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ఇంపాక్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు వీటి ద్వారా మరిన్ని మెళకువలు నేర్చుకొని తమ ఆలోచనా పరిధిని పెంచుకోవాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు. ఈ …

Read More »

ప్రజల భాష, యాస వాడిన మేధావి కాళోజి

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల కోసమే ప్రజల భాషను, యాసను వాడిన మేధావి, ప్రజాకవి పద్మభూషణ్‌ కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని ప్రభుత్వ పండగగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కాళోజి జయంతిని, తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి అనంతరం మాట్లాడారు. ఒక్క సిరాచుక్క, లక్ష మెదళ్ళకు కదలిన అని తెలుపుతూ కాళోజీ జయంతిని జరుపుకోవడం …

Read More »

అర్హులైన వారికి చీరలు అందించాలి

  – ఎంపిపి రజనీకాంత్‌రెడ్డి పిట్లం, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలో 18 సంవత్సరాలు నిండిన యువతులు అర్హులైన వారికి బతుకమ్మ చీరలు అందించాలని ఎంపిపి రజనీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచుల పండుగగా గుర్తించి 18 సంవత్సరాలు నిండిన యువతులకు చేనేత చీరలు పంపిణీ చేయనుందని, ఈ పంపిణీపై ఈనెల 11న మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. పిట్లం మండలంలో …

Read More »

ఘనంగా కాళోజీ జయంతి

  పిట్లం, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపిపి రజనీకాంత్‌రెడ్డి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన నాటి మహనీయులు కాళోజీ నారాయణరావు, అలాంటి మహనీయులను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపిడివో పర్బన్న, తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, వైస్‌ ఎంపిపి నర్సాగౌడ్‌, ఎంపిటిసి జగదీష్‌, తెరాస నాయకులు నవీన్‌, …

Read More »