Breaking News

ఒంటికాలుపై నిలబడి ఆర్టీసి కార్మికుల నిరసన

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒంటికాలుపై నిలబడి కామారెడ్డి ఆర్టీసి తెలంగాన మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వారు చేస్తున్న రిలే నిరాహార ద్షీలు సోమవారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలగించిన నిజామాబాద్‌ జేబిఎస్‌ సర్వీసులను పునరుద్దరించాలని, పిన్‌ మిషన్‌ సరిపడ కొత్తవి తెప్పించాలని కోరారు. కార్మిక నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పనిభారం పెంచే ఆలోచనలు మానుకోవాలని, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను పెంచాలని, కొత్తబస్సులు తెప్పించాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ప్రేమ్‌కుమార్‌, సాయిలు, కిషన్‌, సారంగపాణి, శేఖర్‌, నారాయణ, రంజిత్‌రెడ్డి, హరినాథ్‌, గోపాల్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *