Breaking News

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో సిబ్బంది పాత్ర కీలకం

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు సోమవారం స్థానిక డైరీ కళాశాలలో రెవెన్యూ రికార్డుల విచారణపై క్షేత్ర స్థాయి అదికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తహసీల్దార్లు, డిప్యూటి తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆర్‌ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్లతో కూడిన క్షేత్ర స్తాయి సిబ్బందితో కలెక్టర్‌ మాట్లాడారు.

1935 తర్వాత ఇప్పుడే రైతుల భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రైతుల భూముల వివరాలకు సంబంధించి వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీనికి మార్గం భూ ప్రక్షాళన కార్యక్రమమే అన్నారు. గ్రామస్థాయిలో సిబ్బంది రైతుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రతిబృందం ఒక్కో గ్రామంలో 10 రోజుల పాటు ఉండి భూమి రికార్డుల ప్రక్షాళన పూర్తిచేయాలని, వందరోజుల వ్యవధిలో ఒక్కో మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. వాట్సప్‌ ద్వారా గ్రూపులు ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ ఆర్డీవోలు దేవేందర్‌ రెడ్డి, శ్రీను, రాజేశ్వర్‌, డిఆర్‌వో మణిమాల, విశ్రాంత తహసీల్దార్‌ విశ్వనాథం తదితరులు ఉన్నారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *