Breaking News

బతుకమ్మ చీరల పంపిణీ పక్కాగా జరపాలి

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలో బతుకమ్మ పండగను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని, చీరలను పకడ్బందీగా పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బతుకమ్మ ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిదులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18, 19 తేదీల్లో బతుకమ్మ చీరల పంపిణీ పూర్తిచేయాలన్నారు. 20న బతుకమ్మలు ప్రారంభించి 28 వరకు నిర్వహించాలని సూచించారు. విజేతలకు వివిధ బహుమతులు అందజేయాలని చెప్పారు. వీక్లిమార్కెట్లో స్థలాన్ని సిద్దం చేసి మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని ఆదేశించారు. హుందాగా పండగ జరుపుకునేట్లు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, ఎస్‌పి శ్వేతరెడ్డి, జేసి సత్తయ్య, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, డిఆర్వో మణిమాల, డిటిడివో గంగాదర్‌, రమేశ్‌, రాధమ్మ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *