Breaking News

ఎమ్మెల్యేను కలిసిన కోమట్‌పల్లి వాసులు

 

నందిపేట, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని కోమట్‌పల్లి వాసులు మంగళవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి గ్రామ సమస్యలు వివరించారు. అభివృద్ది పనులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలోని రామాలయానికి రూ. 12 లక్షల 50 వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా నికాల్‌పూర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా కోమట్‌పల్లి గ్రామ చెరువు నింపడానికి కావాల్సిన పైప్‌లైన్‌ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంజీవ్‌, ఉపసర్పంచ్‌ భోజన్న, లక్కంపల్లి మహేందర్‌, రాజేశ్వర్‌, మల్లయ్య, మల్లేశ్‌, చిన్నయ్య, గంగాధర్‌ తదితరులున్నారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *