Breaking News

గౌడ కులస్తుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని తెలుగునాడు కల్లుగీత కార్మి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరగోని గజేంద్రగౌడ్‌, జాతీయ అధ్యక్షుడు కొయ్యాడ స్వామిగౌడ్‌ డిమాండ్‌చేశారు. మంగళవారం కామరెడ్డిలో వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం గౌడ కులస్తులను, గీత కార్మికులను కుట్రపూరితంగా అణిచివేయాలని చూస్తుందన్నారు. అందుకు నిదర్శనంగా కల్తీకల్లు నెపంతో కల్లు దుకాణాలపై దాడులు చేస్తు అక్రమ కేసులు బనాయిస్తు జైలుకు పంపుతుందన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన వివిధ కులాలకు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి గౌడ కులస్తులకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ వేధింపులు అడ్డుకోవాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రామస్వామిగౌడ్‌, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *