Breaking News

బుధవారం రాత్రి పల్లెనిద్ర

 

నందిపేట, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బుధవారం రాత్రి మండలంలోని వెల్మల్‌ గ్రామంలో ప్రజాదర్బార్‌, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జీవనన్న యువసేన అధ్యక్షుడు మహేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ చేయని వినూత్న రీతిలో పల్లెనిద్ర, ప్రజాదర్బార్‌ కార్యక్రమం ద్వారా దళితవాడలో నిద్రపోతూ ప్రజా సమస్యలు తెలుసుకొని వెనువెంటనే పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులను కోరారు.

Check Also

ఎంబిసి వర్గాల సమస్యల పరిష్కారానికి ఉద్యమం

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంబిసి వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *