Breaking News

ఐదోరోజుకు చేరిన ఆర్టీసి కార్మికుల సమ్మె

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ఆర్టీసి తెలంగాణ మద్నూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి ఐదోరోజుకు చేరుకున్నాయి. నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా ప్రజలకు అవసరమైన సర్వీసులను పెంచాలని, కార్మికులకు పనిభారం తగ్గించాలని, తదితర డిమాండ్లతో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. దీక్షలో శ్రీనివాస్‌, శంకరయ్య, సుభాష్‌రెడ్డి, ఆఫీస్‌, అశోక్‌లు కూర్చున్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నారాయణ, సంగారెడ్డి, గోపాల్‌, హరీష్‌, అజర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *