Breaking News

ఉచిత సంస్కృత భాషా ప్రశిక్షణ తరగతులు

 

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలో వేల సంఖ్యలో భాషలున్నాయని, వాటన్నింటికి మూలం భారతీయ సంస్కృత భాష అని ఆచార్య వేదమిత్ర అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అటువంటి అన్ని భాషలకు తల్లిఅయిన సంస్కృత భాషను అందరు నేర్చుకోవాలనే సంకల్పంతో ఉచిత ప్రశిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి 27 వరకు వారంరోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గంటపాటు ఉచిత ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నిజామాబాద్‌లోని స్థానిక ఆర్యసమాజంలో ప్రశిక్షణ ఉంటుందన్నారు. అంతేగాకుండా శుద్ధమైన వేదమంత్రోచ్చారణ, శ్లోక పఠనం, శుద్ధమైన శాస్త్రాధ్యయనం, ఆధ్యాత్మిక జ్ఞానం, సాహిత్యం, ఇతిహాస, పురాణాల అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఆసక్తిగల వారు తమ పేర్లను ఆర్యసమాజంలో నమోదు చేయించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *