ప్రొఫెసర్ కంచె ఐలయ్య పై గరమైతున్నారు ఆర్యవైశ్యులు. ఆయన రాసిన.. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు పుస్తకం తమను కించపరిచెటట్టు ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగారు ఆర్యవైశ్యులు. ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ కేసులు పెట్టారు. ఆయన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
మల్కాజిగిరిలో..
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి చౌరస్తాల ఆర్యవైశ్యులు నిరసనకు దిగారు. కించపరిచేలా కంచె ఐలయ్య పుస్తకం రాశారని ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్యులను స్మగ్లర్లు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ లో..
కంచె ఐలయ్య రాసిన పుస్తకం.. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ మహబూబాబాద్ లో నిరసనకు దిగారు ఆర్యవైశ్యులు. ఐలయ్య దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
జమ్మికుంటలో..
తన వర్గాన్ని కంచె ఐలయ్య కించపరిచారంటూ.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కంచె ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు ఆర్యవైశ్యులు. పుస్తకాన్ని నిషేదించాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఓయూ పోలీస్ స్టేషన్ లో ఐలయ్య ఫిర్యాదు
మరోవైపు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నయని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కంచె ఐలయ్య. ఆర్య వైశ్య సంఘాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. ఫోన్ నంబర్లను పోలీసులకు ఇచ్చారు. తనపై ఆరోపణలు చేస్తున్న వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు కంచె ఐలయ్య

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018