Breaking News

తల నరికి, మర్మాంగం కత్తిరించి!

  •  అక్కను గర్భవతి చేశాడని హత్య
బెంగళూరు: సోదరిని గర్భవతిని చేసిన వ్యక్తిని అన్నదములిద్దరూ కలిసి చంపేశారు. ఒడిసాకు చెందిన గాంధీ జె.రాయ్‌ (19), మధు జె.రాయ్‌ (21). తమ అక్కతో కలిసి బెంగళూరులో ఒక గార్మెంట్స్‌ పరిశ్రమలో పని చేస్తున్నారు. తమ సోదరి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చూపించారు. ఆమె గర్భవతిగా తేలింది. ఒడిసా నుంచే వచ్చి తమ ప్రాంతంలోనే నివసించే బిరాంచి మాంజీ అనే వ్యక్తే తమ అక్కను గర్భవతిని చేసినట్లు గాంధీ, మధు తెలుసుకున్నారు. ‘మద్యం తాగుదాం రా’ అంటూ బిరాంచిని ఎలకా్ట్రనిక్‌ సిటీ నైస్‌ టోల్‌ గేట్‌ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అతడిని అక్కడే చంపి… తలను వేరు చేశారు. మర్మాంగాన్నీ కోశారు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *