కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 33 వేల 143 బతుకమ్మ చీరలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 4 లక్షల మంది మహిళలకు చీరలు పంపినీ చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మిగిలిన 98 వేల 71 మంది మహిళలకు గురువారంలోగా పంపినీ చేయనున్నట్టు తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ బుధవారం అభివృద్ది పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని, 8 ఎకరాల్లో రాశి వనం ప్రారంభించామని, ఇవి పట్టణ వాసులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. రాశి వనాన్ని ఇతర సంస్థల సభ్యులను భాగస్వామ్యం చేసి అభివృద్ది చేసుకుందామని సూచించారు. సిండికేట్‌ బ్యాంకు 10 లక్షల భాగస్వామ్యంతో కార్యక్రమంలో పాలుపంచుకోవడం పట్ల కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. గురువారంలోగా చీరల పంపిణీ పూర్తిచేస్తామని మిగిలితే 22 లోగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎంపి బి.బి.పాటిల్‌, డిసిసిబి ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, ఎంపిపి లక్ష్మి, మంగపతి, ఆర్డీవో శ్రీను, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, హార్టికల్చర్‌ ఎ.డి. శేఖర్‌, అగ్రికల్చర్‌ జెడి నాగేంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *