Breaking News

మూడోరోజు బతుకమ్మ చీరల పంపిణీ

 

మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ చీరల పంపిణీ మూడోరోజు మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో బుధవారం కొనసాగించారు. దర్మోరాలో సర్పంచ్‌ రాజేందర్‌, తిమ్మాపూర్‌లో సర్పంచ్‌ భూమేశ్వర్‌ చీరలు పంపిణీ చేశారు. అన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు చీరల పంపిణీకై సిబ్బంది, సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో మహిళలు ఉత్సాహంగా క్యూలైన్లలో నిలబడి చీరలు తీసుకుంటున్నారు. చీరల పంపిణీని మోర్తాడ్‌, ఏర్గట్ల తహసీల్దార్లు సూర్యప్రకాశ్‌, ముల్తజుద్దీన్‌లు పర్యవేక్షించారు.

Check Also

పందులను నివారించ లేరా?

నందిపేట్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఏముంది ..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *