ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై కాంగ్రెస్‌ కౌన్సిలర్ల నిరసన

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ పరిధిలో జరిపిన ప్రారంభోత్సవాల్లో వేయించిన శిలాఫలకాలపై ప్రోటోకాల్‌ నిబందన ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు బల్దియా కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిలాఫలకాల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ పేరును నిబంధనలకు విరుద్దంగా కిందివరసలో చేర్చారని అభ్యంతరం తెలిపారు.

మునిసిపల్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌లో కూడా షబ్బీర్‌ అలీ పేరు లేదన్నారు. కామారెడ్డి జిల్లా అడ్వర్టయిజ్‌మెంట్‌లో డిసిసిబి ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, నిజామాబాద్‌ ఎంపి కవితల ఫోటో వేయించడంపై అభ్యంతరం తెలిపారు. పార్టీఅభివృద్దిలో పూర్తిగా సహకరిస్తున్నప్పటికి ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. ప్రోటోకాల్‌ పాటించని అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు నిమ్మ దామోదర్‌రెడ్డి, కైలాష్‌ లక్ష్మణ్‌, బట్టు మోహన్‌, యాదమ్మ, ఫిరోజ్‌ సుల్తానా, సునీత, జమీల్‌, రామ్మోహన్‌, నర్సింలు, పద్మ పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *