Breaking News

50 పడకల ఆసుపత్రికి రూ. ఏడుకోట్లు మంజూరు

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు గాను కొత్తగా 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఏదుకోట్లు మంజూరయ్యాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వెంటనే టెండరు ప్రక్రియ ద్వారా పనులు ప్రారంభించాలన్నారు. తనిఖీ సందర్బంగా రోగులు ఆసుపత్రి బయట అపరిశుభ్ర పరిసరాల్లో భోజనం చేయడం, షెడ్లు లేకపోవడంపై స్పందిస్తు వెంటనే ఇఇఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని, తాత్కాలిక షెడ్డు నిర్మించాలని ఆదేశించారు. తాగునీరు సరఫరా చేసేందుకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని, పంచాయతీ రాజ్‌ ద్వారా మరుగుదొడ్లు, డ్రైనేజీ, దోమల మెష్‌, గార్డెన్‌, ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 15 రోజుల్లోగా యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిసిహెచ్‌ఎస్‌ సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, పంచాయతీ రాజ్‌ డిప్యూటి ఇఇ మురళి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *