ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

 

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆద్వర్యంలో దాతల విరాళాలతో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శైలపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బీర్కూర్‌లో నార్ల భరత్‌రాజ్‌ విగ్రహదాతగా హనుమాన్‌ ఆలయ కమిటీలో దుర్గామాతను ఏర్పాటు చేశారు. మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో ఆలయం వరకు అమ్మవారిని ఘనంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. గురుస్వామి రత్నకంటి ప్రకాశ్‌ ఆద్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *