విద్యార్థులు స్వశక్తితో ఎదగడానికి కృషి చేయాలి

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు ఉద్యోగమే ప్రథమ లక్ష్యం కాకుండా స్వశక్తితో ఎదిగేందుకు కృసి చేయాలని తెలంగాణ ఇంటర్‌ సెన్యుయర్స్‌ మోటివేషనల్‌ అండ్‌ ప్రమోషనల్‌ ఆర్గనైజేషన్‌ (టెంపో) రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సెల్ప్‌ డెవలప్‌మెంట్‌, లక్ష్యసాధన అనే అంశాలపై అవగాహన కల్పించారు.

విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తిచేసిన వెంటనే ఉద్యోగమే ప్రథమ లక్ష్యంగా అన్వేషణ ప్రారంభిస్తారని, అలాకాకుండా తమ ఆలోచనే పెట్టుబడిగా మార్చి స్వయంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు. నేటి అధునాతన యుగంలో అనేక రంగాల్లో అవకాశాలున్నాయని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. దాంతోవారు ఉపాధి పొందడంతోపాటు ఇతరులకు ఉపాధి కల్పించవచ్చని సూచించారు. ఇందుకోసం ఖచ్చితమైన ప్రణాళిక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో టెంపో ప్రతినిది రాంచంద్ర, మైక్రో సాప్ట్‌ మాజీ ఉద్యోగి అశోక్‌ నవాలే, కెరీర్‌ పబ్లిష్‌ ప్రోగ్రాం ఫౌండర్‌ రవి, సోషల్‌ మీడియా ఎక్స్‌పర్ట్‌ రాజ్‌మెసా, యాజమాన్యం హరిస్మరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *