Breaking News

బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నిజామాబాద్‌

 

మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ జయంతి రోజున నిజామాబాద్‌ జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించనున్నట్టు డ్వామా పిడి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మోర్తాడ్‌లోని ఇజిఎస్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి ఉపాధి హామీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 88 వేల 789 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేశామని, మరో 500 నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 99 వేల 454 మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మరో 1100 మరుగుదొడ్లు అనివార్య కారణాల వల్ల నిలిచిపోయాయని, వీటిని సైతం పూర్తిచేస్తామని తెలిపారు.

విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వేతనాల కోత :

ఉపాధి హామీ పథకంలో పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇజిఎస్‌ అధికారుల వేతనాలు కోత పెడతామని పిడి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గత మూడునెలల క్రితం హరితహారంలో గుంతలు తవ్విన ఉపాధి కూలీలకు వేతనాలు అందించడం లేదని, విదుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిఎ, టిఎలు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల వేతనాలు కట్‌ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి నర్సయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *