Breaking News

బతుకమ్మకు కీర్తితెచ్చిన ఘనత తెరాసదే

 

మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకునిచ్చే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తితెచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, జడ్పిటిసి ఎనుగందుల అనిత అన్నారు. బుధవారం మోర్తాడ్‌లో ప్రభుత్వం అదికారికంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడి కార్యకర్తలు శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో, ఐకెపి ఆద్వర్యంలో వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద ఆడి, పాడి అందరిని అలరింపజేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బతుకమ్మ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, మహిళల్లో చైతన్యం కల్పించి ఖండాంతర ఖ్యాతి గడించిన కృషి ఎంపి కవితదేనన్నారు. ఆలయాల నుంచి బతుకమ్మలను ప్రధాన వీదుల గుండా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చెరువుల వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, సర్పంచ్‌ దడివె నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

క్యాంపు కార్యాల‌యంలో హరితహారం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ...

Comment on the article