Daily Archives: October 1, 2017

సంగం గ్రామంలో స్వచ్ఛహి సేవా

  బీర్కూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో సేవాసంఘ్‌ ఫ్రెండ్స్‌యూత్‌, నెహ్రూ యువకేంద్ర సంఘటన్‌ వారి ఆద్వర్యంలో స్వచ్ఛహి సేవా కార్యక్రమం నిర్వహించారు. యూత్‌ ఉపాధ్యక్షుడు సునీల్‌ రాథోడ్‌ మాట్లాడుతూ భారత ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా భారతదేశాన్ని అక్టోబర్‌ 2 గాంధీ జయంతి నాటికి పరిశుభ్ర బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జనరహిత దేశంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందన్నారు. ఇందులో భాగంగా సంగం తాండాలో 510 ఇల్లు …

Read More »

ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

  బీర్కూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ఆదివారం దేవీమాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మండ ల కేంద్రంలోని హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాతను ప్రత్యేక రథంలో అలంకరించి గ్రామంలోని ప్రధాన వీదుల గుండా ఊరేగించారు. మాలధార స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక బాజాన్‌ చెరువుల్లో మాతను నిమజ్జనం చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈయేడు కూడా ఉత్సవాలు జరపడం ఆనందంగా ఉందని కమిటీ అద్యక్షుడు అవారి గంగారాం …

Read More »

దళితులకు మూడెకరాల భూపంపిణీ చేయాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా దళితులకు మూడెకరాల భూపంపిణీకి దోమకొండ మండల దళితులు అర్హులు కాదా అని జిల్లా కార్యదర్శి రాజలింగం, నాయకులు కె.రాజులు అన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎంసిపిఐయు పార్టీ మండలంలోని అన్ని గ్రామాల భూమిలేని దళితులకు భూమిని పంపిణీ చేయాలని అర్హుల గుర్తింపు జాబితా ప్రభుత్వానికి అందించి భూమిని సాధించేందుకు పోరాటానికి దశలవారిగాఉద్యమ ప్రణాళిక రూపొందించినట్టు, దీనికోసం గ్రామాల్లోని …

Read More »

ఘనంగా వయోవృద్దుల దినోత్సవం

  భీర్కూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 1 అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ వాసవీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆర్యవైశ్య సంఘంలో కార్యక్రమం నిర్వహించారు. వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అద్యక్షుడు వీరేశం ఆద్వర్యంలో గ్రామంలోని లక్ష్మయ్యసేట్‌, అడప్పలను సన్మానించి, ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు చేతికర్ర అందజేశారు. వయోవృద్దులకు చేయూతగా సత్కరించడం జరిగిందని క్లబ్‌ సభ్యుడు ప్రవీణ్‌ గుప్త అన్నారు. కార్యక్రమంలో బీర్కూర్‌ క్లబ్‌ అధ్యక్షుడు వీరయ్య గుప్త, రంజీత్‌కుమార్‌ గుప్త, దత్తుగుప్త, పొత్తురి ప్రవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?

ఫ్ర : ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది? జ : ‘జీవం’ అంటేనే రసాయనిక ధర్మాల సమాకలనమేనని, ‘కణ నిర్మాణం’ అంటేనే రసాయనిక పదార్థాల మధ్య ఉన్న అనుబంధమేనని, రుచులు, వాసనలన్నీ రసాయనిక పదార్థాలకు, జ్ఞానేంద్రియాలైన నాలుక, ముక్కుల్లో ఉన్న రసాయనిక గ్రాహకాల (chemoreceptors) కు మధ్య ఏర్పడే చర్యాశీలతే (reactivity) నని జీవ రసాయనిక శాస్త్రం (biochemistry) ఋజువు చేసింది. ఆపిల్‌ పండులో ప్రధానంగా ఎన్నో ఇతర రుచిలేని గుజ్జు, నీటితో పాటు అందులో కరిగిన గ్లూకోజ్‌ వంటి చక్కెరలున్నాయి. …

Read More »