Daily Archives: October 2, 2017

మే నుంచి రైతులకు ఎకరాకు రూ. 4 వేలు

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు వచ్చే మే నెల నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున పంపిణీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా రైతులకు సులభతరంగా సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నట్టు తెలిపారు. మరో 22 గ్రామాలను ఓడిఎస్‌గా ప్రకటించుకోబోతున్నట్టు …

Read More »

రోగులకు పండ్ల పంపిణీ

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందీజయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు సోమవారం వాసవీసేవాసమితి కామారెడ్డి ఆధ్వర్యంలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. వాసవీకమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా రోగులకు వాటిని అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిదులు శంకర్‌గుప్త, సత్యనారాయణ గుప్త, కృష్ణమూర్తి, పాతరామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి

  కామరెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని టిడబ్ల్యుజేఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులపై దాడులు, హత్యలకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లో సోమవారం గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టాలంటే ప్రత్యేక చట్టాలు అవసరమన్నారు. దాడులు, హత్యలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి …

Read More »

బహ్రెయిన్‌లో క్యాసంపల్లి వాసి మృతి

  కామరెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా క్యాసంపల్లికి చెందిన బుక్య బాషా బహ్రెయిన్‌ దేశంలో వాటర్‌ ట్యాంక్‌లో పడి మృతి చెందినట్టు మృతుని సన్నిహితులు తెలిపారు. జీవనోపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన బాషా వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. ట్యాంకరులో నీటిని నింపుతున్న సమయంలో ట్యాంకర్‌ నిండిందా, లేదా చూస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం …

Read More »

స్వచ్చతకోసం పాటుపడదాం

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చతకోసం అందరూ పాటుపడదామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గాంధీజయంతిని పురస్కరించుకొని సోమవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని గాంధీజి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో బాపూజీ, శాస్త్రిజి చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజి చేసిన పోరాటంలాగానే స్వచ్చత కోసం మనం పోరాడాల్సిన అవసరముందన్నారు. ఇందులో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, ఎస్‌పి …

Read More »

ఐలయ్యకు నిరసనగా సంతకాల సేకరణ

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైశ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యకు నిరసనగా వైశ్యులు లక్ష సంతకాలు సేకరిస్తున్నారు. సోమవారం గాంధీజి జయంతిని పురస్కరించుకొని బీబీపేట మండల కేంద్రంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్‌ అయిన ఐలయ్య కులాలను వ్యతిరేకిస్తూ పుస్తకాలు రాయడం ఆయన చావుకబారు తనానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిదులు రాజేశ్వర్‌, బాలరాజయ్య, విశ్వప్రసాద్‌, వీరేశం, నాగభూషణం, రామచంద్రం, …

Read More »

ఘనంగా బాపూజీ జయంతి

  నందిపేట, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహింసా మార్గాన్ని తన ఊపిరిగా భావించిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ఘనంగా జరిపారు. మండల కేంద్రంలోని పాతూరులోగల గాంధీజి విగ్రహానికి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పూలమాలలువేసి నివాళులు అర్పించి ఆయన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ సత్యం, అహింసా, శాంతి, సహనం అనే సూత్రాలతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహాత్ముడని కొనియాడారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెంట ఇంద్రుడు …

Read More »

కన్నుల పండువగా దుర్గామాత శోభాయాత్రలు

  మోర్తాడ్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం దుర్గామాత, బతుకమ్మ నిమజ్జనాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మోర్తాడ్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో ఐకెపి మహిళలు, అంగన్‌వాడి టీచర్లు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మోర్తాడ్‌ ముసలమ్మ చెరువు వద్ద, తిమ్మాపూర్‌ ఊరచెరువు వద్ద దుర్గాదేవి, బతుకమ్మల నిమజ్జనానికి ఆయా గ్రామాల సర్పంచ్‌లు దడివె నవీన్‌, ఉగ్గెర భూమేశ్వర్‌ ప్రత్యేక సౌకర్యాలు …

Read More »

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

  మోర్తాడ్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో గ్రామ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు గాంధీ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్‌ ఎంపిడివో కార్యాలయంలో ఎంపిపి కల్లడ చిన్నయ్య, తాళ్లరాంపూర్‌ గ్రామ పంచాయతీలో జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఏర్గట్ల, మోర్తాడ్‌ తహసీల్దార్లు సూర్యప్రకాశ్‌, ముల్తజుద్దీన్‌లు గాంధీజి చిత్రపటాలకు పూలమాలలువేసి వేడుకలు నిర్వహించారు. టిడిపి, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని గాంధీజి …

Read More »

పాత సామాన్ల బండిలో కంప్యూటర్‌ మానిటర్లు…

  నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలం మారుతుంది… టెక్నాలజీ రోజుకో కొత్తదనాన్ని సంతరించుకుంది… అధునాతన సాంకేతిక పరికరాలు శరవేగంగా మార్కెట్లోకి వస్తున్నాయి… ఈ నేపథ్యంలో పాతవాటికి కాలం చెల్లుతుంది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌ నగర వీధుల్లో ఓ పాత సామాన్ల బండిపై కంప్యూటర్‌ మానిటర్లు దర్శనమిచ్చాయి. అందరూ వింతగా మానిటర్లను చూస్తూ ముక్కున వేలేసుకున్నారు.

Read More »