Breaking News

Daily Archives: October 3, 2017

విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ అన్నారు. మంగళవారం వివిధ జిల్లాల్లోని గిరిజన అధికారులతో పాటు వసతి గృహాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందేలా చూడాలని, వసతి గృహాల్లో అవసరమైన సరుకుల వివరాలను పంపి వాటిని విద్యార్థులకు చేకూర్చాలని ఆదేశించారు. …

Read More »

భూ రికార్డుల ప్రక్షాళన సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

  కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి వెళ్ళి భూ రికార్డుల ప్రక్షాళన తీరును పరిశీలించారు. రైతులను అడిగి సాదక బాదకాలు తెలుసుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం రైతుల కోసమే చేపడుతుందని, దానికి రైతులు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. తద్వారా భూరికార్డుల వివరాలు పక్కాగా పొందుపరచబడతాయని, రైతులకు మేలు చేకూరుతుందని వివరించారు. …

Read More »

రైతు సమన్వయ కమిటి రద్దుకై అఖిలపక్షం ధర్నా

  కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం రైతు సమన్వయకమిటిలను రద్దు చేయాలని అఖిలపక్షం ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ఎంపిడివో, ఎస్‌ఎస్‌పి కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సమన్వయ కమిటీ తెరాస కార్యకర్తల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో అన్ని వర్గాల రైతులకు …

Read More »

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయం ఎగువ భాగంలోగల సంగారెడ్డి సింగూరు జలాశయంలోకి భారీగా వరదనీరు రావడంతో సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేసి 3 వేల క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వస్తుందని డిఇ దత్తాత్రి తెలిపారు. సింగూరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జలాశయంలో వరదనీరు వచ్చి చేరడంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతుందని పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.910 టిఎంసిలకుగాను 28.810 టిఎంసిల నీరు …

Read More »

జీవో 39 రద్దు చేసేవరకు పోరాటం ఆగదు

  – జిల్లా జేఏసి పిలుపు నందిపేట. అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కొరకు చేసిన జీవో 39-42 ను వెంటనే రద్దుచేసి గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతూ జిల్లా జేఏసి ఛైర్మన్‌ గోపాల్‌శర్మ అధ్యక్షతన మాక్లూర్‌ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన అఖిలపక్ష సత్యాగ్రహానికి విచ్చేసిన నాయకులు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. జివో రద్దు అయ్యేవరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆకుల లలిత …

Read More »

జీవో 39- 42 రద్దుచేయాలని వినతి

  నందిపేట, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కొరకు విడుదల చేసిన జీవో39-42 ను రద్దు చేయాలని కోరుతూ అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా అద్యక్షుడు గంగాధర్‌ మంగళవారం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. రైతు సమన్వయ సమితుల కొరకు ఏకపక్షంగా గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేసి తెరాస కార్యకర్తలకు అప్పజెపుతున్నందున అట్టి జివోను వెంటనే రద్దుచేయాలని వినతి పత్రంలో కోరారు.

Read More »