Daily Archives: October 4, 2017

మరుగుదొడ్లు వాడకుంటే సంక్షేమ పథకాలు రద్దు

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకుంటే, వాటిని వాడకుంటే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు రద్దుచేయడం జరుగుతుందని గ్రామసభలో ప్రజలందరు ఏకగ్రీవంగా తీర్మానించారని కోమలంచ గ్రామ సర్పంచ్‌ సత్యనారాయణ అన్నారు. గ్రామంలో గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయాల గురించి పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప చదివి వినిపించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ మరుగుదొడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 12 వేల …

Read More »

వన్యప్రాణులను రక్షించాలి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వన్యప్రాణులను రక్షించడానికి తీసుకునే చర్యలపై బాన్సువాడ రేంజ్‌ అధికారి శివజ్యోతి అవగాహన కల్పించారు. ఒడ్డేపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షణ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వన్యప్రాణులను వేటాడడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయని, వాటిని చంపడం చట్టరీత్యా నేరమని అన్నారు. వాటిని ఎలా కాపాడాలి, వాటి గురించి మనం ఎలా రక్షించుకోవాలని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌రేఖ, డిఆర్‌డివో సంజయ్‌ గౌడ్‌, హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Read More »

లారీ, బైక్‌ ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏపి 25 ఎఎన్‌ 325 నెంబరుగల బైక్‌ కోటగిరి నుంచి మహ్మద్‌నగర్‌ వైపు వెళుతుండగా మహ్మద్‌ నగర్‌ నుంచి బాన్సువాడ వైపు వస్తున్న ఏపి 16 టిఎస్‌ 6859 నెంబరుగల లారీ బైక్‌ను ఢీకొనడంతో తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108 వాహనంద్వారా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఆరేటి రాములు, కుర్మ సాయన్న, ఆరేటి సాయన్న ఉన్నారు.

Read More »

ఘనంగా కొమురం భీమ్‌ వర్ధంతి

  నందిపేట, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివాసి నాయక్‌పోడ్‌ సేవా సంఘం నందిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట యోధుడు, అమరవీరుడు కొమరం భీమ్‌ అమరదినం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కొమరం భీం ఆదిలాబాద్‌ జిల్లా జోనేఘాట్‌గ్రామంలో జన్మించి గిరిజన హక్కుల కోసం పోరాడి అమరుడయ్యాడని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో సురేశ్‌, సాగర్‌, రాజు, సాయిలు, శ్రీనివాస్‌, గోపి, ప్రశాంత్‌, సాగర్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

  కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన తాండావాసులకు ఆరోగ్యశ్రీ కార్డులను బుధవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పంపిణీ చేశారు. లింగంపేట్‌ మండలంలోని లింగంపల్లి కుర్దు ప్రాంతంలోని ఎల్లమ్మతాండాలోని 20 మంది గిరిజనవాసులకు కలెక్టర్‌ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ తాండాలు భగీరథ పల్లి దళితవాడను ఆదర్శవాసాలుగా గుర్తించి వారికి కావాల్సిన మౌలిక వసతులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా రేషన్‌ కార్డులు, పింఛన్‌, ఆరోగ్యశ్రీ, తదితరాలను సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఎల్లమ్మతాండాకు 15, …

Read More »

ఛలో కరీంనగర్‌ పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రబుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి ఆత్మగౌరవ సభ పేరుతో ఈనెల 5న తలపెట్టిన ఛలో కరీంనగర్‌ గోడప్రతులను బుధవారం కామరెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రయివేటు విద్యాసంస్థల అధ్యక్షుడు ఆనంద్‌రావు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రయివేటు విద్యాసంస్థలు అతి తక్కువ ఫీజుతో సేవలందిస్తుండగా విద్యాసంస్థలపై ఒత్తిళ్ళు చేయడం సమంజసం కాదన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేసేందుకు సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని …

Read More »

బియ్యం దుకాణాలపై విజిలెన్సు అధికారుల దాడులు

  – 800 లీటర్ల కిరోసిన్‌ పట్టివేత కామరెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండల కేంద్రంలోని బియ్యం దుకాణాలపై ఎన్‌పోర్సుమెంట్‌ అండ్‌ విజిలెన్సు అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 32 క్వింటాళ్ళ రేషన్‌ బియ్యం, 800 లీటర్ల కిరోసిన్‌ స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత దుకాణాలపై కేసులు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు వినాయకరెడ్డి, బాల్‌రెడ్డి, రమేశ్‌కుమార్‌, లక్ష్మారెడ్డి, సంజీవ్‌రెడ్డి, విఆర్వోలు మల్లికార్జున్‌, సాయిలు పాల్గొన్నారు.

Read More »

రైతులను సంఘటితం చేసి ఆత్మాభిమానంతో జీవించేలా చేస్తాం

  – మంత్రి పోచారం కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను సంఘటితం చేసి ఆత్మాభిమానంతో, గౌరవంగా బతకడానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం దోమకొండ, కామారెడ్డి మండలాల్లో మంత్రి వివిద అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అన్నిరకాలుగా అండదండలందించడానికి ప్రబుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. దేశంలో …

Read More »

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్టు

  కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో క్రికెట్‌ బెట్టింగులు చేస్తున్న పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పట్టణ సిఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. పక్కా సమాచారం మేరకు దాడిచేసి క్రికెట్‌ బెట్టింగ్‌ చేస్తున్నవారిని పట్టుకున్నామన్నారు. వారినుంచి రూ. 21 వేల 340 స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్టయిన వారిలో కంకణాల అనిల్‌, నంగునూరి సంతోష్‌, మాడుగుల నరేశ్‌, రాజు, అంకం లక్ష్మణ్‌లు ఉన్నట్టు పేర్కొన్నారు.

Read More »

కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌గా పల్లారావు

  కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌గా పల్లారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ డిఎంఎ కార్యాలయంలో మెప్మా పిడిగా పనిచేస్తున్న ఆయన కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌గా బదిలీపై వచ్చారు. ఏళ్ళతరబడి ఇన్‌చార్జిల పాలనలో, ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న బల్దియాకు ఎట్టకేలకు కమీషనర్‌ రావడంతో పాలన గాడిన పడే అవకాశముంది.

Read More »